– ఎవరి హయాంలో ఏం చేశామో వివరిద్దాం
– సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబరు5: హైదరాబాద్ అభివృద్ధి పై తనతో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి కెటిఆర్ సవాల్ విసిరారు. హైదరాబాద్ అభివృద్ధి ఎవరి హయాంలో ఏం జరిగిందో వివరిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ, సచివాలయం, గాంధీ భవన్ ఎక్కడైనా సరే.. రేవంత్‌తో చర్చకు రెడీ అని ఛాలెంజ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరాశ, నిస్ప•హతో ఉన్నారని విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ మీడితో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి ఖాయమని రేవంత్‌కు అర్ధమైందని సెటైర్లు గుప్పించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తప్పదని భావించి రేవంత్‌రెడ్డి తనపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ అధినేత కేసీఆర్ సూచనలతోనే రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు తాను దిగటం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు చెప్పాలని కేసీఆర్ తనకు చెప్పారని పేర్కొన్నారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ అభివృద్ధిపై రేవంత్‌రెడ్డి చర్చకు రావాలని సవాల్ విసిరారు. హోంశాఖను పర్యవేక్షిస్తున్న రేవంత్‌రెడ్డి హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో గన్, డ్రగ్ కల్చర్ పెరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్.. చెత్త సిటీ, క్రై సిటీగా మారిందని విమర్శించారు. అండర్ పాస్‌లు, ప్లైఓవర్లు కేసీఆర్ హయాంలోనే నిర్మించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చాక ఎన్ని ఫ్లై ఓవర్లు కట్టారో చెప్పాలని సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలోని పదేళ్లలో వంద లింకు రోడ్లు నిర్మించామని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చాక రోడ్లపై ఉన్న ఒక గుంత కూడా ఎందుకు పూడ్చలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ మాదిరిగా రేవంత్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చెత్త సమస్య పరిష్కారానికి స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి తాము శ్రీకారం చుట్టామని నొక్కిచెప్పారు. మెట్రో నిర్మించిన ఎల్అండ్ టీని సీఎం రేవంత్‌రెడ్డి బెదిరించారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఫ్లై ఓవర్లు, అండర్‌పాసులు నిర్మించామన్నారు. హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేదెవరో ప్రజలందరికీ తెలుసునని, కాంగ్రెస్ హయాంలో మంచినీటి కష్టాలు మొదలయ్యాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో హైదరాబాద్‌ను క్లీన్ సిటీగా మార్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌ను మురికికూపంగా మార్చిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో విద్యుత్ వెలుగులు నిండాయని, గ్రీన్ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దామన్నారు.హెచ్‌సీయూలో జీవవైవిధ్యాన్ని నాశనం చేసిన ఘనత రేవంత్‌రెడ్డిదన్నారు. రేవంత్ బెదిరింపులకు ఎన్నో పరిశ్రమలు తరలిపోతున్నాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా మారాయని విమర్శించారు. మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ డ్రగ్స్ దందాను పట్టుకున్నారని, ముఖ్యమంత్రి, పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి రిపోర్ట్‌ను ఇంటింటికీ పంపిస్తామన్నారు.కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.5,328 కోట్లు ఖర్చు చేశామని, మెట్రోపై రూ.1,722 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎస్ఆర్డీపీ కింద రూ.333కోట్లతో షేక్‌పేట ఫ్లై ఓవర్‌ను నిర్మించామని గుర్తు చేశారు. ఎర్రగడ్డలో రూ.900 కోట్లతో టిమ్స్ హాస్పిటల్ని నిర్మించామన్నారు. వెయ్యి పడకలతో టిమ్స్ హాస్పిటల్ని నిర్మించింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూంలు కట్టామని, రెహ్మత్‌నగర్‌లో కట్టిన 3600 డబుల్ బెడ్రూంలను పంపిణీ చేశామన్నారు. ప్రైవేట్ వాళ్లు కడితే ఒక్కో డబుల్ బెడ్రూంకు రూ.కోటి ఛార్జ్ చేసేవారన్నారు. ఆసరా పెన్షన్, కల్యాణలక్ష్మి కింద దాదాపు రూ.600 కోట్లు అందించామన్నారు. 106 మందికి దళితబంధు అందించామన్నారు. పండుగల కోసం 14కోట్లు అందించామని, అన్నపూర్ణ భోజనాల కోసం రూ.2కోట్లు చెల్లించినట్లు వివరించారు. మైనారిటీల కోసం 204 గురుకులాలను ఏర్పాటు చేశామని చెప్పారు. బోరబండలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.87కోట్లు ఖర్చు చేశామని, రూ.17కోట్లతో ఫంక్షన్ హాలు నిర్మించినట్లు తెలిపారు. రూ.455 కోట్లతో పది సబ్స్టేషన్లను కట్టామని, జూబ్లీహిల్స్‌లో విద్యుత్ నిర్వహణ కోసం రూ.505కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇంటింటికీ తాగునీరు ఇచ్చేందుకు రూ.30కోట్లు ఖర్చు చేశామన్నరు. బీఆర్ఎస్ హయాంలో రూ.5328 కోట్లు ఖర్చు చేస్తే.. రెండేళ్ల రేవంత్ పాలనలో ఎంత ఖర్చు చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గోపీనాథ్ వేసిన శిలాఫలకం జూబ్లీహిల్స్‌లో ఎక్కడికి పోయినా కనిపిస్తుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో 34 అవార్డులు వచ్చాయని., రేవంత్ పాలనలో ఎన్ని వచ్చాయని ప్రశ్నించారు. ప్రజలే న్యాయనిర్ణేతలని.. జూబ్లీహిల్స్‌లో సరైన జవాబిస్తారని కేటీఆర్ అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





