– లేదంటే కేటీఆర్, హరీష్‌రావు వీడతారా
– జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సవాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28:జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై బీఆర్ఎస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులకి గట్టి సవాల్ విసిరారు. తనపై పెట్టిన కేసులు నిజమైతే తాను రాజకీయాలని వదిలి హైదరాబాద్ విడిచి వెళ్లిపోతానని ఛాలెంజ్ చేశారు. కానీ ఆ కేసులు ఫాల్స్ అని తేలితే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వం తనపై, తన కుటుంబ సభ్యులపై, అనుచరులపై ఒకే సంవత్సరంలో 20 నుంచి 30 తప్పుడు కేసులు పెట్టిందని ధ్వజమెత్తారు. తన ద రౌడీ అని ప్రచారం చేయడంపై బీఆర్ఎస్ నేతల కుట్ర ఉందని విమర్శించారు నవీన్ యాదవ్. తనకు న్యాయవ్యవస్థ నమ్మకం కలిగించిందని.. తనను కాపాడిందని ఉద్ఘాటించారు. అలాగే, కాంగ్రెస్ ప్రచార రథాన్ని తగులబెట్టే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా కేసు నమోదైందని తెలిపారు. పోలీసులు ఈ విషయంపై చర్య తీసుకుంటారని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌పైన విశ్వాసం ఉంచారని నవీన్ యాదవ్ నొక్కిచెప్పారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ గెలుపుతోనే సాధ్యమవుతుందని నవీన్ యాదవ్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




