కాలానికగుణంగా కుల వృత్తిదారులు మారాలి

– రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కరిస్తాం
– వారి అభివృద్ధిపై సమీక్షలో మంత్రి పొన్నం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: బలహీన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడిన వారు కాలానికనుగుణంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆర్థిక వృద్ధి సాధించేలా ఎదగాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకాంక్షించారు. సచివాలయంలోని తన చాంబర్‌లో షాద్‌నగర్‌ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్‌ ఆధ్వర్యంలో రజక వృత్తిదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజక వృత్తిదారుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నా,ఈ బ్రాహ్మణ సెలూన్‌లు బ్యూటీపార్లర్లుగా, రజక ధోభీఘాట్‌లు అధునాతన డ్రైక్లీనింగ్‌లుగా మారినప్పుడే వృత్తిదారులు ఆర్థికంగా ఎదుగుతారని అన్నారు. హైదరాబాద్‌ నగరంలో రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందనతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. త్వరలోనే తొమ్మిది మోడర్న్‌ ధోబీఘాట్‌లు రాబోతున్నాయని, రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 మోడర్న్‌ ధోబీఘాట్‌లు ఏర్పాటు చేసేలా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నగరంలో 12 ధోబీఘాట్‌లకు ఏర్పడిన సమస్యలు మరమతులు చేసేలా కార్యచరణ తీసుకుంటామని పేర్కొన్నారు. సుదీర్ఘ కాలంగా పెండిరగ్‌లో ఉన్న బేగంపేట ధోబీఘాట్‌ సమస్యపై రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఆరా తీశారు. చాలా జిల్లాల్లో రజక వృత్తిదారులకు కేటాయించిన భూమిపై వస్తున్న ఇబ్బందులు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు, కలెక్టర్లు సమన్వయం చేసుకుని పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. సెలూన్‌లకు, రజక వృత్తిదారులకు ప్రభుత్వం ఇస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సరఫరా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నామని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌ బాలమయదేవి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన, ఆర్డీవో, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, రజక వృత్తిదారుల సంఘం నేతలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *