కోదండరాం, అజార్‌ పేర్లకు ఓకే

– సీఎం రేవంత్‌కు సమాచారమిచ్చిన కేసీ వేణుగోపాల్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: తెలంగాణలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేట్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సోమవారం ఆమోదం తెలిపారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మహమ్మద్‌ అజారుద్దీన్‌ల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏఐసీసీకి పంపిన విషయం విదితమే. వీరిద్దరి పేర్లను అధిష్టానం ఆమోదించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *