TG News | ప్రాణ, ఆస్తి న‌ష్టం క‌ల‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు

  • మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు అదనంగా SDRF బలగాలు – మంత్రుల భరోసా 
  • వర్షాల ప్రభావం, సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్

హైదరాబాద్, ఆగస్టు 27 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముంద‌స్తుగా చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు ఆదేశాలను జారీ చేస్తున్నారని వారు తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధ‌వారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. ఈ టెలికాన్ఫరైన్స్ లో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ, గత రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్న మెదక్, కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలకు జిల్లాలకు అదనంగా SDRF బృందాలను పంపాలని ఆదేశించారు. అదేవిధంగా సహాయ పునరావాస చర్యలను చేపట్టేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని, ఇప్పటికే జిల్లా కలెక్టర్ల వద్ద విపత్తుల నిర్వహణకు సంబంధించిన నిధులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే మరిన్ని నిధులకు కేటాయించడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

మెదక్ (Medak) జిల్లాలో పోచారం ప్రాజెక్టు డ్యాం పై నుండి నీరు ప్రవహిస్తుందని, ఈ విషయంలో నదికి సమాంతరంగా ఉన్న కాలువకు గండి కొట్టి నీటిని విడుదల చేసి తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని పొంగులేటి ఆదేశించారు. ఏదైతే ప్రాజెక్టులు చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయో ఆయా పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్లు ఇతర సీనియర్ ఇంజనీర్లు సంబంధిత ప్రాజెక్టులు నీటి వనరుల చెంతనే ఉండి పరిస్థితులను సమీక్షించాలని మంత్రి పేర్కొన్నారు.

హైదరాబాద్ నుండి ఏవిధమైన సహకారం కావాలంటే, అందిస్తామని జిల్లా కలెక్టర్లకు తెలిపారు. ఏదైనా ప్రాజెక్టు, చెరువులు మత్తడి పోస్తే వెంటనే తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని , సంబంధిత శాఖల సీనియర్ ఇంజనీర్లు, జిల్లా ఉన్నతాధికారులు ఆయా ప్రాజెక్టుల స్థలాలలొ ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలవకుండా చర్యలు చేపట్టాలని, ముంపుకు గురైన బస్తీలు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహారం మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని. అన్నారు ముఖ్యంగా పోలీస్ శాఖ ద్వారా ఈ ఆహారం, మంచినీటిని అందించాలన్నారు అందించాలన్నారు.

సుర‌క్షిత ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప్ర‌త్యేక అధికారులు

భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలలో సహాయకురావాస చర్యలను పర్యవేక్షించడానికి, ఇతర సురక్షిత పనులను చేపట్టడానికి సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. అదేవిధంగా, సచివాలయంలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు చెప్పారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రస్తుత సమయంలో ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలవకుండా, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా తమకు అండగా ఉంటుందని విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. మెదక్ కామారెడ్డి నిర్మల్ జిల్లాలకు అదనంగా ఎస్ డి ఆర్ ఎఫ్ బలగాలను పంపిస్తున్నామని, ఇప్పటికే నిర్మల్ కామారెడ్డి జిల్లాలో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని సీఎస్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను బట్టి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకుగాను ప్రత్యేకంగా హెలికాప్టర్లను కూడా పంపించేందుకు చర్యలు చేపట్టామని సిఎస్ వివరించారు.

ఈ టెలికాన్ఫెన్స్ లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, పోలీస్ శాఖ అడిషనల్ డీజీ మహేష్ భగవత్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *