17.జనధర్మో విజయతే
ప్రజాకవి, ప్రజారవి అని యాదగిరి గుండెల్లో నిద్రించిన వాడు.
‘‘నైజాము సర్కరోడా, నాజీల మించినోడా యమబాధలు పెడ్తివి కొడకో…
చుట్టుపట్టు సూర్యపేట, నట్టనడుమ నల్లగొండ ఆవాల హైద్రాబాదా, తర్వాత
గోలకొండ, గోలకొండా ఖిల్లకింద నీ గోరీకడతం కొడకో నైజాము సర్కరోడా!’’
ప్రజాకవి యాదగిరి ప్రజల్ను ఉరికించిన మరో ప్రజాకవిత్వం ఇది: బండెనుక బండికట్టి పదహారు బండ్లుకట్టి
ఏ బండ్లో పోతవ్ కొడకో నా కొడక ప్రతాపరెడ్డి
దొడ్లన్ని కాలిపోయె, ఎడ్లన్ని ఎల్లిపోయె
ఇకనైన లజ్జలేద, నా కొడక ప్రతాపరెడ్డి
గొల్లోళ్ళ గొర్లు ఒడిసె, రైతోళ్ల బియ్యమొడిసె
ఇక ఏమి తింటవు కొడకో, నా కొడక ప్రతాపరెడ్డి!
పెదపంది ‘సూరిగాడు‘, సినపంది ‘మల్లిగాడు‘,
మీ ఇద్దర్ని తింటం కొడకో నా కొడక ప్రతాపరెడ్డి
ఒక భూస్వామ్య ప్రభువు గురించి ప్రసిద్ధ పాట బండి ఎన్క బండి కట్టి రచించాడు బండి యాదగిరి. గ్రామానికో కవి, ఇంటికో కళకారుడన్నట్లు చదువు, సంధ్యలు లేనివారు కూడా పాటలు కట్టి ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. బండెన బండికట్టి పదహారు బండ్లు కట్టి అనే గేయం రాసింది నిరక్షరాస్యుడైన యాదగిరి. ఈ పాట నైజాం సర్కారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.
(H.E.H. Nizam Mir Osman Ali Khan Bahadur, Asaf Jah VII, Nizam of Hyderabad) వీరిగుండెల్లోనే నిద్రబోయినవాడు యాదగిరి

(ఆ పాట వినవచ్చు చూడవచ్చు https://www.youtube.com/watch?v=IcbJDYmRmUY MAA BHOOMI| Bandenaka Bandi Katti| బండెనక బండి కట్టి | గద్దర్| Gaddar| B.Narsing Rao
తెలంగాణ గతి వివరించే ఇది చిన్న సినిమా. https://www.youtube.com/watch?v=-5MyhPaUbI0 Bandi yadagiri | Bandenaka bandi Katti Song )
వరంగల్లు ప్రముఖులు ఎం ఎస్ ఆచార్య మిత్రులు
ఆచార్యగారి సన్మిత్రులు వీరభద్రరావు జగదీశ్వర్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులు. చాలా సంవత్సరాలు జనధర్మ పత్రికను వీరే ప్రచురించారు. 1958 నుంచి 1971 దాకా ఆయన ప్రింట్ చేయించారు. ఇద్దరూ పనులెన్నో చేస్తూ ఉంటూనే గంటల మధ్య చదరంగం ఆడుకునే వారు. చాలా కాలం ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టర్ గా వీరభద్రరావుగారు పనిచేసేవారు. మాకు విచిత్రంగా కనిపించేది.
ఓ సందర్భంలో ముఖ్యమంత్రి పి వి నరసింహారావు అభినందన సంచిక ప్రచురించారు. ప్రెస్ పక్కన ఉన్న చిన్న హాల్ లో తివాచీ పైనే కూర్చోవడం, మైక్ లేదు. నిలబడి ఒక్కొక్కరు ఉపన్యాసం చేయడం. సంచిక ఆవిష్కరణ సభ అది. పాములపర్తి సదాశివరావు ఈ సంచికలో దీర్ఘమైన వ్యాసం రచించారు.
భగవద్గీతా పాఠశాలలో ఈ రచయిత ఇక్కడ చదువుకునే వాడిని. పక్కనే ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. ఎదురుగా ఆచార్యగారికి ఒక చిన్న ఆఫీస్ ఉండేది. ఆఫీస్ అంటే ఒక బీరువా, కింద జంపఖాన, లేదా తివాజీ ఉండేది అంతే. ఆచార్య గారు కింద కూచుని ఓ చిన్న బల్లపై రాసుకుండే వారు.
ఈ పాఠశాల ఆనుకున్న గల్లీలో జె పి ఎన్ రోడ్ కు చేరతారు. అక్కడే వారి మరో మంచిమిత్రులు ఆంధ్ర పేపర్ స్టోర్స్ యజమానులు సాంబశివరావుగారు ఉండేది. పక్కన గొప్పరచయిత, ఛందోబద్ధమైన సామాజిక విమర్శాత్మకమైన కవి, పల్లా రామకోటార్య గారు, వారికి కూడా జె పి ఎన్ రోడ్ లోనే ప్రెస్ ఉండేది. దానిపై దాటి లక్ష్మీటాకీస్ దగ్గర బాలాజీ ప్రింటింగ్ ప్రెస్ లో ఆచార్యగారు, మాకుటుంబం అక్కడే ఉండేది. పక్కన కాళోజీ సోదరులు నారాయణరావుగారు. కాళోజీ రామేశ్వర్ రావుగారు. ఈ పెద్దమనుషులు ఒక చోట ఉంటే గొప్ప చర్చలే. వారిలో మిమిక్రీ వేణుమాధవ్ గారు ఉండాల్సిందే కదా. కాళోజీ కి పద్మవిభూషణ్ తో సన్మానించిన సందర్భంలో ఈ పెద్దలు 1991లో కలుసుకున్నారు.
తెలంగాణకు విప్లవ కవి. మా భూమి సినిమాకోసం కొంచెం మార్చారు. మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను గద్దర్ పాడి, ఆడాడు. 1985 లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. జన నాట్య మండలిలో చేరాడు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథ ల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. కింద గోచి ధోతి, పైన గొంగళి ధరించేవాడు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేలు కాసెట్ లు గా, సిడిలుగా రికార్డ్ అయ్యి అత్యధికంగా అమ్ముడుపోయాయి. ఏడాది కిందట గద్దర్ మరణించారు.

ఆ నాటికీ ఏ నాటికీ సజీవమైంది ఈ పాట. కసి, కోపం, ప్రజల వజ్ర ధృడ సంకల్పాన్ని ప్రకటిస్తున్నది యాదగిరి. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ నుండి వామపక్ష పార్టీలో సాధారణ సభ్యుడు. తుంగతుర్తి ప్రాంతంలోని నూతనకల్ మండలం వెంకిపల్లి (వెలకలపల్లి)కు చెందిన నాగిళ్లి వెంకమ్మ, రాములు పుట్టిన మామూలు మనిషి. చిన్నప్పటి నుండే గంజి మెతుకులకు అల్లాడిన జీవితం అతనిది. ఆ కాలంలో తెలంగాణ పరగణాకు చెందిన పేదల జీవన స్థితి అంతే. ఇటువంటి మనుషులను పట్టి పీడిస్తున్న నిజాం ముష్కరులు, భూస్వామ్య పెత్తందారులు సాగించిన ఆగడాలకు అంతులేనివి. ప్రశ్నించే గొంతుకల కోసం ధైర్యం ఇచ్చే గుండెల కోసం ఎదురు చూస్తున్న వేళ యాదగిరి ఓ పాటై, మాటల తూటై బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిజాం సైన్యాన్ని గడగడలాండించిన వీరుడు. ఈపాట గద్దర్ పాడుతూ ఉంటూ, ఆడుతూ ఉంటే తెలంగాణ రగిలిపోయింది. అవన్నీ చదువుతూచూస్తూ చర్చించుకుంటూ ఆచార్య నైజాం రజాకార్లతో పోరాడుతున్నదశ అది. వాళ్లంతా కలిసి ‘ఇంకెన్నాళ్లు?’ అంటూ అని చాలా మంది ప్రశ్నించారు. మనంమంతా ప్రజాకవి కాళోజీ అందరిలోప్రశ్నించే రగించిన వాడాయన. .
దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొని దొరలై వెలిగేదెన్నాళ్లు?
హింసను పాపమనెంచు దేశమున హిట్లరత్వమింకెన్నాళ్లు?
కలముపోటున కదపజాలని కావ్యగానమింకెన్నాళ్లు?
అని ప్రశ్నించిన వ్యక్తులు తెలంగాణాను వెలిగించిన వారు.
-మాడభూషి శ్రీధర్





