ఉద్యోగుల సంక్షేమమే ప్రధానం

ట్రాన్స్‌కోలో కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20: విద్యుత్‌ శాఖ సిబ్బంది సంక్షేమమే ప్రజా ప్రభుత్వ విధానం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్‌లో ట్రాన్స్‌కోలో 18 మందికి కారుణ్య నియామక పత్రాలు శుక్రవారం సాయంత్రం అందజేశారు. ఇందులో ఏడుగురు రెగ్యులర్‌ ఉద్యోగులు కాగా ఆర్టిజెన్స్‌ 11మంది ఉన్నారు. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన ట్రాన్స్‌కో ఉద్యోగుల కుటుంబీకులతోపాటు ఆర్టిజన్స్‌కు కూడా కారుణ్య నియామకాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆర్టిజన్స్‌ను కూడా రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. కారుణ్య నియామక పత్రాలు పొందిన ఉద్యోగులు సంస్థ అభ్యున్నతికి తోడ్పడాలని ఉద్బోధించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో సీఎండి కృష్ణభాస్కర్‌, డైరెక్టర్లు సూర్య ప్రకాష్‌, బి.నర్సింగరావు, జి. నరసింహారావు, ఖీAడజజA గుప్తా, జాయింట్‌ సెక్రెటరీ ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *