మేడిగ‌డ్డ‌లో రెండు పిల్ల‌ర్లు మాత్ర‌మే కుంగాయి

– కాశేళ్వ‌రం మొత్తం కూలింద‌ని ప్ర‌చారం చేశారు
– కాళేశ్వ‌రం అంటే కేవ‌లం మేడిగ‌డ్డ మాత్ర‌మే కాదు
– కాళేశ్వ‌రం ప్రాజెక్టువ‌ల్ల‌నే యాసంగి పంట‌లు పండాయి
-మేడిగ‌డ్డ‌నుంచి మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌వ‌ర‌కు అన్నీవాడుక‌లో వున్నాయి
-గోదావ‌రి జ‌లాల్లో తెలంగాణ 400 టీఎంసీల‌కు మించి ఎప్పుడూ వాడుకోలేదు
– ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌లో హ‌రీష్‌రావు 

 

మేడిగ‌డ్డ బ్యారేజీలో రెండు పిల్ల‌ర్లు కుంగితే మొత్తం కాళేశ్వ‌రం ప్రాజెక్టు కూలిపోయింద‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నార‌ని మాజీ మంత్రి, హ‌రీష్‌రావు అన్నారు. శ‌నివారం తెలంగా ణ భ‌వ‌న్‌లో కాళేశ్వ‌రంపై దుష్ప్ర‌చారం-వాస్త‌వాలు అనే అంశంపై మాజీమంత్రి హ‌రీష్‌రావు ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 45రోజుల‌కే మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చించి ఎటువంటి అభ్యంత‌రాలు పెట్ట‌కుండా ఒప్పించి కాళేశ్వ‌రం ప్రాజెక్టును పూర్తిచేశామ‌న్నారు. ఈ ప్రాజెక్టు ద్వారం తెలంగాణ‌లో 20.33 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం సాగునీరు అందించింద‌న్నారు. కాళేశ్వ‌రం ప్రా జెక్టు అంటే కేవ‌లం మేడిగ‌డ్డ బ్యారేజీ మాత్ర‌మే కాదు, 3 బ్యారేజీలు, 15 రిజ‌ర్వాయ‌ర్లు, 19 స‌బ్‌స్టేష‌న్లు, 21 పంప్‌హౌజ్‌లు, 203 కి.మీ సొరంగాలు,1531 కి.మి. గ్రావిటీ కాల్వ‌లు, 93 ప్రెజ‌ర్ మెయిన్స్, 141 టి.ఎం.సి.ల నిల్వ సామ‌ర్థ్యం, 530 మీట‌ర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోత‌లు వున్నాయ‌న్నారు. త‌మ్మిడిహ‌ట్టి నుంచి ఎల్లంప‌ల్లికి నీళ్లు ఎత్తిపోసేలా ముందు రూప‌క‌ల్ప‌న చేసిన‌ప్ప‌టికీ, త‌మ్మిడిహ‌ట్టివ‌ద్ద నీళ్లు త‌క్కువ వుంటాయ‌ని తేల‌డంతో ప్రాజెక్టును మేడిగ‌డ్డ‌కు మార్చామ‌న్నారు. మేడిగ‌డ్డ బ్యారేజీలో 7 బ్లాకులు, 85 పియ‌ర్ల నిర్మాణం జ‌రిగింది. కాళేశ్వ‌రం లేకుండానే యాసంగి పంట‌లు పండాయ‌ని కాంగ్రెస్ చెబుతోంది. కానీ ఈ ప్రాజెక్టు వ‌ల్ల‌నే యాసంగి పంట‌లు కూడా పండాయ‌న్న‌ది అస‌లు వాస్త‌వ‌మ‌న్నారు. ఈ ప్రాజెక్టుకు మూడు వ‌న‌రుల నుంచి నీరు ల‌భిస్తుంది.  ఈ నీటితో వేలాది చెరువుల‌ను పూర్తిగా నింప‌వ‌చ్చున‌న్నారు. మేడిగ‌డ్డ‌నుంచి మ‌ల్ల‌న్న సాగ‌ర్ వ‌ర‌కు నిర్మించినవ‌న్నీ వాడుక‌లోనే వున్నాయి. కేవ‌లం కాళేశ్వ‌రం కాల్వ ద్వారానే 90వేల ఎక‌రాల‌కు నీరు అందింవ‌చ్చున‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన త‌ర్వాత గోదావ‌రి జ‌లాల్లో 940 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమ‌తించారు. కానీ ఏనాడూ 400 టీఎంసీల‌కు మించి నీటిని వాడుకోలేద‌న్న స‌త్యాన్ని గుర్తుచేశారు. ప్రాణ‌హిత‌-చేవెళ్ల ప్రాజెక్టుకు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అనుమ‌తులు సాధించ‌లేదు. ప్రాజెక్టు అనుమ‌తి లేకుండానే కాల్వ‌ల నిర్మాణం చేప‌ట్టింద‌న్నారు. 2007లో ప్రాణ‌హిత‌-చేవెళ్ల ప్రాజెక్టు వ్య‌యం రూ.17వేల కోట్లుగా చూపారు. ప్రాజెక్టు ఇంకా ప్రారంభం కాకుండానే 2011లో ఏకంగా రూ.40వేల కోట్ల‌కు పెంచిన చ‌రిత్ర కాంగ్రెస్‌ది అంటూ విమ‌ర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *