శంషాబాద్ లో నుంచి నేటి ఉదయం ప్రారంభమైన భారత జూడో యాత్ర ఆరాంఘర్, పురాణాపూల్ మీదుగా సాయంత్రం చార్మినార్ చేరుకుంది. బాధ్రతా కారణాల దృష్ట్యా ఇరుకుగా ఉన్న ప్రాంతాల్లో నుంచి వాహనం ద్వారా రాహుల్ గాంధీ చార్మినార్ వద్దకు చేరుకున్నారు. వద్దకు చేరుకున్న జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ గీతాలాపన అనంతరం ఆయన యాత్రకు బయలుదేరారు. చార్మినార్ నుంచి గాంధీభవన్, నాంపల్లి సెక్రటేరియట్ మీదుగా నెక్లెస్ రోడ్ కి చేరుకోనుంది. నెక్లెస్ రోడ్ లోని రాజీవ్ గాంధీ సద్భావనయాత్ర స్మారక స్తూపం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించి కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే నేరుగా నెక్లెస్ రోడ్ సభాస్థలి వద్దకు చేరుకోనున్నారు.




