ఇద్దరు మావోయిస్టు పార్టీ సాంకేతిక నిపుణుల టీం సభ్యుల  అరెస్ట్

రామగుండం,ప్రజాతంత్ర,డిసెంబర్ 02:
 మంచిర్యాల జోన్  జైపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని ఇందారం గ్రామంలో  ఒక ఇంట్లో శనివారం   నిషేదిత సీపీ ఐ  (మావోయిస్ట్) పార్టీ, టెక్నికల్ డిపార్ట్‌మెంట్, సెంట్రల్ టెక్నికల్ టీమ్ క్యాడర్, డి . గంగాధర  రావు అలియాస్  నర్సన్న అలియాస్  బక్కన్న అలియాస్  వెంగో దాదా మరియు అతని భార్య భవానీ అలియాస్  సుజాత అలియాస్  శ్యామల,  మావోయిస్టు పార్టీ వివిధ విభాగాల   మెంబర్ లు ఉన్నారనే నమ్మదగిన సమాచారం మేరకు రామగుండము పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక బృందం వారి  ఇంటిని తనిఖి చేసి వారిని అదుపులోకి తీసుకోని పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేసి  అరెస్ట్ చేయడం జరిగిందని  రామగుండము పోలీస్ కమిషనర్ శ్రీమతి రెమా రాజేశ్వరి, ఐపిఎస్   మీడియా సమావేశంలో తెలియజేసారు . తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్  జార్ఖండ్, రాష్ట్రాల్లో  గత రెండు మూడు సంవత్సరాలుగా తిరుగుతూ మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తూ . .గత కొద్ది నెలల క్రితం ఇందారం గ్రామానికి రావడం జరిగిందని తెలిపారు.వీరికి  సహాయం చేసిన సిపిఐ మావోయిస్టు సానుభూతి పరుడైన చిప్పకుర్తి శ్రీనివాస్ పెంచికల్పేట్ మండలం కమాన్ పూర్  ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అతని కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే అతని పట్టుకుంటామన్నారు.వీరి పై జైపూర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 240/2023,  ,120(B)r/w34 IPC సెక్షన్ ల కింద   మరియు సెక్షన్  10,13,18,18(b) అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన చట్టం-1967 ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *