8 అసెంబ్లీ నియోజక వర్గాల అభ్యర్థులు మినహా .. ఎక్కడి వారు అక్కడే ..

-కామారెడ్డి, గజ్వేల్‌ ‌నుండి సీఎం కేసీఆర్‌..
– ‌సిట్టింగులకే ప్రాధాన్యత
– 115 సీట్లకు జాబితా విడుదల

హైదరాబాద్‌: ‌తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌సోమవారం నాడు ప్రకటించారు. 115 మంది అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించారు.ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్‌ ‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ ‌విడుదల చేశారు. ప్రగతి భవన్‌ ‌నుండి సీఎం కేసీఆర్‌ ‌నేరుగా తెలంగాణ భవన్‌ ‌కు చేరుకున్నారు. అభ్యర్థుల జాబితాలో స్వల్ప మార్పులున్నాయని సీఎం కేసీఆర్‌ ‌చెప్పారు. ఏడు సిట్టింగ్‌ ‌లలో మార్పు చేసినట్టుగా సీఎం కేసీఆర్‌ ‌చెప్పారు. కామారెడ్డి, గజ్వేల్‌ ‌నుండి సీఎం కేసీఆర్‌ ‌పోటీ చేయనున్నారు. హూజూరాబాద్‌ ‌లో కౌ శిక్‌ ‌రెడ్డి, దుబ్బాకలో కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీ నరసింహారావు, ఉప్పల్‌ ‌లో బండారు లక్ష్మారెడ్డిలు పోటీ చేయనున్నారు.జనగామ, నర్సాపూర్‌, ‌నాంపల్లి, గోషామహల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఇంకా కొంత అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ అభ్యర్థుల ప్రకటనను పెండింగ్‌ ‌లో ఉంచినట్టు సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు.

పరకాల- చల్లా ధర్మారెడ్డి
వరంగల్‌ ‌వెస్ట్- ‌దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌
‌వరంగల్‌ ‌తూర్పు- నన్నపునేని నరేందర్‌
‌వర్ధన్నపేట- ఆరూరి రమేష్‌
‌భూపాలపల్లి- గండ్ర వెంకటరమణా రెడ్డి
ములుగు- బడే నాగజ్యోతి
పినపాక- రేగా కాంతారావు
కోరుట్ల-కల్వకుంట్ల సంజయ్‌
‌ఖమ్మం- పువ్వాడ అజయ్‌
‌పాలేరు- కందాల ఉపేందర్‌ ‌రెడ్డి
మధిర- లింగాల కమల్‌ ‌రాజు
వైరా- మదన్‌ ‌లాల్‌
‌సత్తుపల్లి- సండ్ర వెంకటవీరయ్య
కొత్తగూడెం- వనమా వెంకటేశ్వరరావు
ఆశ్వరావుపేట- మెచ్చా నాగేశ్వరరావు
భద్రాచలం- తెల్లం వెంకటరావు
సిర్పూర్‌- ‌కోనేరు కోనప్ప
చెన్నూరు- బాల్క సుమన్‌
‌బెల్లింపల్లి- దుర్గం చిన్నయ్య
మంచిర్యాల- ఎన్‌. ‌దివాకర్‌ ‌రావు
ఆసిఫాబాద్‌- ‌కోవా లక్ష్మి
ఖానాపూర్‌- ‌భూక్యా జాన్సన్‌ ‌నాయక్‌
ఆదిలాబాద్‌- ‌జోగు రామన్న
బోథ్‌- అనిల్‌ ‌జాదవ్‌
‌నిర్మల్‌- అల్లోల ఇంద్రకరణ్‌ ‌రెడ్డి
ముథోల్‌- ‌విఠల్‌ ‌రెడ్డి
ఆర్మూర్‌- ఆశన్నగారి జీవన్‌ ‌రెడ్డి
బోధన్‌- ‌షకీల్‌ అమీర్‌ ‌మహమ్మద్‌
‌జుక్కల్‌- ‌హన్మంత్‌ ‌షిండే
బాన్సువాడ- పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి
ఎల్లారెడ్డి- జాజుల సురేందర్‌ ‌రెడ్డి
కామారెడ్డి- కేసీఆర్‌
‌నిజామాబాద్‌ అర్బన్‌- ‌బిగాల గణేష్‌ ‌గుప్తా
నిజామాబాద్‌ ‌రూరల్‌- ‌బాజిరెడ్డి గోవర్ధన్‌
‌బాల్కొండ- వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి

ధర్మపురి- కొప్పుల ఈశ్వర్‌
‌రామగుండం- కోరుకంటి చందర్‌ ‌పటేల్‌
‌పెద్దపల్లి- దాసరి మనోహర్‌ ‌రెడ్డి
కరీంనగర్‌- ‌గంగుల కమలాకర్‌
‌చొప్పదండి- సుంకే రవిశంకర్‌
‌వేములవాడ- చల్మెడ లక్ష్మీనరసింహారావు
సిరిసిల్ల- కేటీఆర్‌
‌మానకొండూరు- రసమయి బాలకిషన్‌
‌హూజూరాబాద్‌- ‌పాడి కౌశిక్‌ ‌రెడ్డి
హుస్నాబాద్‌- ‌వొడితెల సతీష్‌ ‌కుమార్‌
‌సిద్దిపేట- హరీష్‌ ‌రావు
మెదక్‌- ‌పద్మా దేవేందర్‌ ‌రెడ్డి
నారాయణఖేడ్‌- ‌భూపాల్‌ ‌రెడ్డి
ఆంథోల్‌- ‌క్రాంతికిరణ్‌ ‌చంటి

జహీరాబాద్‌- ‌మాణిక్‌ ‌రావు
ఇల్లందు-హరిప్రియానాయక్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *