నేడు ప్ర‌పంచ సుంద‌రి ఫైన‌ల్ పోటీలు – హైట‌క్స్ వేదిక‌గా కార్య‌క్ర‌మం

72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ తెలంగాణహైదరాబాద్‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మే 31న సాయంత్రం 6:30 గంటలకు జరుగనుందిప్రపంచవ్యాప్తంగా 108 మంది వివిధ దేశాల పోటీదారులు అందంఉద్దేశంఐక్యతతో జరుపుకునే ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడతారుసుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో వీరంతా పాల్గొని తమ ప్రతిభను చాటటంతో పాటుతెలంగాణలో ప్రముఖ పర్యాటకఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారుతెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారుమిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ వాలెభారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంభర్ హోస్ట్ లుగా వ్యవహరిస్తారుబాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ఇషాన్ ఖట్టర్ ఫైనల్స్ లో స్టేజ్ పైన లైవ్ ప్రదర్శనలు ఇవ్వనున్నారుప్రముఖ మానవతావాదినటుడు సోనూ సూద్‌కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ప్రధానం చేయనున్నారుఆయన ఫైనల్స్ కు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తారుఇతర జ్యూరీలుగా సుధా రెడ్డిడాక్టర్ కారినా టర్రెల్ (మిస్ ఇంగ్లాండ్ 2014), మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ ఉన్నారుమిస్ వరల్డ్ 2017, బాలీవుడ్ నటి మనుషి చిల్లర్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నారుఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం భారతదేశంలో సోనీ లివ్‌లో లైవ్ స్ట్రీమ్ అవుతుందికొన్ని దేశాలలో జాతీయ టెలివిజన్‌లో ప్రసారం అవుతుందిప్రపంచవ్యాప్తంగా www.watchmissworld.com ద్వారా హై డెఫినిషన్‌లో అందుబాటులో ఉంటుంది.
ఫైనల్స్ లో ఎంపిక విధానం
– 108 మంది పోటీదారుల నుండిప్రతి ఖండం (అమెరికాకరీబియన్ఆఫ్రికాయూరప్ఆసియా & ఓషియానియానుండి 10 మంది సెమీఫైనలిస్టులుమొత్తం 40 మంది క్వార్టర్ ఫైనల్స్ కు చేరతారు.
– కొందరు పోటీదారులు ఫాస్ట్ట్రాక్ ఛాలెంజ్‌ల ద్వారా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌ కు చేరుకున్నారు.

వారి వివరాలు
అమెరికా & కరీబియన్:
హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ద్వారా అన్నాలిసే నాంటన్ (త్రినిటాడ్ & టొబాగో),
టాప్ మోడల్ ద్వారా ఆరెలీ జోకిమ్ (మార్టినిక్),
బ్యూటీ విత్ ఎ పర్పస్ ద్వారా వలెరియా పెరెజ్ (ప్యూర్టో రికో)మల్టీ మీడియా అవార్డు ద్వారా మైరా డెల్గాడో (డొమినికన్ రిపబ్లిక్).
ఆఫ్రికాహెడ్ టూ హెడ్ ఛాలెంజ్ ద్వారా ఫైత్ బ్వాల్యా (జాంబియా),
టాప్ మోడల్ ద్వారా  సెల్మా కమన్య (నమీబియా)బ్యూటీ విత్ ఎ పర్పస్ ద్వారా నటాషా న్యోన్యోజి (ఉగాండా)మల్టీ మీడియా అవార్డు ద్వారా  ప్రిన్సెస్ ఇస్సీ (కామెరూన్).
యూరప్స్పోర్ట్ ఛాలెంజ్ ద్వారా ఎలిసే రండ్మా (ఎస్టోనియా)హెడ్ టు హెడ్ ఛాలెంజ్ తో పాటు బ్యూటీ విత్ ఎ పర్పస్ ద్వారా మిల్లీ మే ఆడమ్స్ (వేల్స్)టాప్ మోడల్ ద్వారా జాస్మిన్ గెర్హార్డ్ట్ (ఐర్లాండ్)మల్టీ మీడియా అవార్డ్ ద్వారా ఆండ్రియా నికోలిచ్ (మాంటెనెగ్రో).
ఆసియా & ఓషియానియాటాలెంట్ అండ్ బ్యూటీ విత్ ఎ పర్పస్ ద్వారా మోనికా కెజియా సెంబిరింగ్ (ఇండోనేషియా)హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ద్వారా ఇడిల్ బిల్గెన్ (టర్కీ)టాప్ మోడల్ ద్వారా నందిని గుప్తా (భారతదేశం)మల్టీ మీడియా అవార్డు ద్వారా  ఓపల్ సుచాతా (థాయిలాండ్).
– మిగిలిన సెమీఫైనలిస్టులు వ్యక్తిగత ఇంటర్వ్యూల తర్వాత జడ్జ్ ల ప్యానెల్ ద్వారా ఎంపిక చేయబడతారుమరియు ఫైనల్ షో సమయంలో వెల్లడిస్తారు.
– క్వార్టర్ ఫైనల్స్ నుండిప్రతి ఖండం నుండి టాప్ 5, ఆ తర్వాత టాప్ 2, మరియు చివరిగా 4 ఖండ విజేతలు ఎంపికవుతారు.  చివరి ప్రశ్నకు స‌రైన  సమాధానంఇచ్చిన‌వారు  కొత్త మిస్ వరల్డ్ ఎన్నికవుతారు .

ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా (71వ మిస్ వరల్డ్ొత్త మిస్ వరల్డ్ విజేతకు కిరీటం అందజేస్తారు. మిస్ వరల్డ్ ప్రపంచంలోనే అతిపెద్దఅత్యంత ప్రభావవంతమైన ఫెస్టివల్‌గా ప్రతీయేటా నిలుస్తోందికేవలం అందచందాలకే ప్రాముఖ్యత కాకుండాఈ కార్యక్రమం తెలివితేటలుసామాజిక న్యాయంసాంస్కృతిక మార్పిడిఉద్దేశ్యంనాయకత్వ లక్షణాల ద్వారా మహిళలను సాధికారతను చేస్తుంది. మిస్ వరల్డ్ ఫైనల్ కార్యక్రమం శనివారం (మే 31హైదారాబాద్ హైటెక్స్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా సోనీ లివ్మిస్ వరల్డ్ యూ ట్యూబ్ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారమ‌వుతుంది.  ప్రపంచ వ్యాప్తంగా 72 వ మిస్ వరల్డ్ ఎంపిక కార్యక్రమం ఒక మరపురాని సాయంత్రంగా మిగిలిపోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *