41మంది మావోయిస్టుల లొంగుబాటు

– లొంగిన వారిలో రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి
– కామారెడ్డికి చెందిన వ్యక్తిగా గుర్తింపు
– రూ.1.46 కోట్లకు పైగా నగదు ప్రోత్సాహకాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 41మంది మావోయిస్టు ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో బెటాలియన్, వివిధ డివిజనల్, ఏరియా కమిటీ స్థాయి నాయకులు కూడా ఉన్నారు. మొత్తం 24 ఆయుధాలు, 733 తూటాలు, 8 బీజీఎల్ షెల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు తెలంగాణ వాళ్లు ఉండటం గమనార్హం. లొంగిపోయిన వారిలో ఆరుగురు డివిజనల్/కంపెనీస్థాయి కమిటీ సభ్యులు, 12 మంది ఏరియా/ప్లాటూన్ కమిటీ సభ్యులు, 23 మంది సాధారణ పార్టీ సభ్యు లు ఉన్నారు. ఇన్సాస్ ఎల్ఎంజీ, ఏకే47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ రైఫిళ్లు, 303 రైఫిళ్లు తది తర ఆయుధాలు లొంగుబాటులో భాగంగా అప్పగించారు. మావోయిస్టు పార్టీలో సంస్థాగత బలహీనత, నాయకత్వంపై నమ్మకం తగ్గడం, అడవుల్లో తీవ్ర జీవన కష్టాలు, భద్రతా బలగాల ఒత్తిడి కారణంగానే తాము ప్రధాన జనజీవనంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు లొంగిపోయిన మావోయిస్టులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి రాష్ట్ర పునరావాస విధానం ప్రకారం డివిజనల్ కమిటీ సభ్యులకు రూ.5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులకు రూ.4 లక్షలు, పార్టీ సభ్యులకు రూ. లక్ష చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు. ఆయుధాలపై అదనపు రివార్డు కూడా ఇవ్వనున్నారు. మొత్తంగా రూ.1.46 కోట్లకు పైగా నగదు ప్రోత్సాహకాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ లొంగుబాటుతో తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు మరింత బలహీనపడతాయని, మిగిలిన అజ్ఞాత కేడర్లు కూడా హింసను వీడి జనజీవ నంలోకి రావాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారిలో రాష్ట్రస్థాయి లీడర్లు,  కొందరు హిడ్మా బెటాలియన్ కమాండర్స్ ఉన్నారు. కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి, ఒడిశా చెందిన‌ ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు, ఇద్దరు తెలంగాణవాసులు ఉన్నారు. మిగ‌తావారంతా ఛత్తీస్ గ‌ఢ్‌కు చెందిన వారిగా డీజీపీ శివధర్  రెడ్డి పేర్కొన్నారు. వారినుంచి 24 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు సెంట్రల్ డీవిజన్ కమాండర్లు ఉన్నట్లు డీజీపీ వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *