భద్రాచలం, ప్రజాతంత్ర, జులై 12: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం 41 అడుగులు దాటి మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ఉంది. పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం పెరుగుతోంది. అధికారులు డీఆర్‌డీఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సాయంత్రానికి 41.30 అడుగులకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం 23 అడుగులే ఉంది. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు నీటిలో మునిగిపోయాయి.
భద్రాచలం వద్ద 41 అడుగులకు చేరిన గోదావరి



