– మూసీలో మునిగి ముగ్గురు యువకుల మృతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందిన ఘటన గండిపేట జలాశయం దిగువన ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు, రెస్క్యూ టీం నదిలో గాలించి వారి మృతదేహాలను సోమవారం ఉదయం ఒడ్డుకు తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్‌కు చెందిన కార్తీక్ (25), గోవర్ధన్ (23), వెంకటేష్ (25)లు ఆదివారం మూసీ నది పరివాహక ప్రాంతంలో చేపల వేటకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండడంతో వారు నదిలో మునిగిపోయారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ టీమ్‌ను రప్పించారు. సాయంత్రం నుంచి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ ముగ్గురూ ఒకే కాలనీ వాసులు కావడంతోపాటు స్నేహితులని వారి బంధువులు తెలిపారు. మృతుల కుటుంబాలు గాంధీ హాస్పిటల్‌కు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



