30 ‌డిపార్టుమెంట్‌లు, 2వేల పడకలు..

  • 27 ఎకరాల్లో రూ. 2వేల కోట్లతో ఉస్మానియా హాస్పిటల్‌
  • నేడు  సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌

హైదరాబాద్‌ ‌గోషామహల్‌ ‌పోలీస్‌ ‌గ్రౌండ్‌లో 27 ఎకరాల్లో దాదాపు 2వేల కోట్ల అంచనా వ్యయంతో ఉస్మానియా కొత్త హాస్పిటల్‌ను నిర్మించ‌నున్నారు. 30 డిపార్ట్‌మెంట్‌లు, 2వేల పడకలుఫిజియోథెరపీడెంటల్‌‌కాలేజ్‌లుహాస్టల్‌ ‌వసతితో ద‌వాఖాన నిర్మాణం జరగనుంది. అడ్డంకులు దాటుకొని శంకుస్థాపనకు సిద్ధమైంది. ఉస్మానియా జనరల్‌ ‌హాస్పిటల్‌. ‌రానున్న టెక్నాలజీ కాలానికి అనుగుణంగా హెలిప్యాడ్‌ ‌వసతిహాస్పిటల్‌ ‌మురుగు నీరు శుద్ధి చేసేందుకు ప్లాంట్‌‌విశాలమైన పార్కింగ్‌ ‌ఫెసిలిటీ తో కొత్త హాస్పిటల్‌ అం‌దుబాటులోకి రానుంది. శుక్రవారం  ఉదయం సీఎం రేవంత్‌ ‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

ప్రతి డిపార్ట్‌మెంట్‌ ‌కోసం స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్ ‌ఫెసిలిటీస్‌తో కూడిన ఆపరేషన్‌ ‌థియేటర్లుపోస్ట్ ఆపరేటివ్‌ ‌వార్డులుఐసీయూ వార్డులు అందుబాటులో ఉంటాయన్నారు. కిడ్నీలివర్‌‌స్కిన్‌ ‌ట్రాన్స్‌ప్లాంటేషన్ల కోసం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ‌విభాగం కొత్త ఉస్మానియాలో అందుబాటులోకి రానున్నాయి. పేషెంట్ల సౌకర్యార్థం అన్ని రకాల డయాగ్నసిస్‌ ‌సేవలను ఒకే చోట అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

గ్రౌండ్‌‌ఫస్ట్ ‌ఫ్లోర్‌లో ఓపీ సేవలు అందించాలని పేషెంట్ల కోసం విశాలమైన వెయిటింగ్‌ ‌హాల్స్‌కనీసం రోజూ 3 వేల నుంచి 5 వేల మంది పేషెంట్లు వొచ్చే అవకాశం ఉన్నందునఇందుకు అనుగుణంగా ఓపీ కౌంటర్ల నిర్మాణం జరగనుంది.ఓపీ కోసం గంటల తరబడి లైన్‌లో నిలబడే ప్రసక్తే ఉండకుండా నిర్మాణం. కొత్త ఉస్మానియాలో నర్సింగ్‌‌డెంటల్‌‌ఫిజియో థెరపీ కాలేజీలు అందుబాటులోకి..స్టూడెంట్ల కోసం హాస్పిటల్‌ ఆవరణలోనే హాస్టల్స్‌ను నిర్మనం. 750 సీట్లతో కూడిన భారీ ఆడిటోరియం అందుబాటులోకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *