262 అక్రమ నిర్మాణాలు నేలమట్టం

  • 23 ప్రాంతాల్లో కూల్చివేతలతో 111.72 ఎకరాల భూమి స్వాధీనం
  • ప్రభుత్వానికి హైడ్రా నివేదిక 

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా.. ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు వంద ఎకరాలకుపైగా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. హైడ్రా గత రెండు నెలలుగా చెరువులు, ఎఫ్‌టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తుంది.

 

రామ్‌నగర్‌ ‌మణెమ్మ గల్లీలో 3, గగన్‌ ‌పహాడ్‌ అప్పా చెరువులో 14, అవి•న్‌పూర్‌ ‌పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్‌ ‌సున్నం చెరువులో 42, దుండిగల్‌ ‌కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. అత్యధికంగా అవి•న్‌పూర్‌లో 51 ఎకరాలు, మాదాపూర్‌ ‌సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కున్నది. హైడ్రాకు ఐపీఎస్‌ అధికారి రంగనాథ్‌ ‌కమిషనర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ప్రత్యేక పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ ‌స్థాయి పోలీసు అధికారులు ఆక్రమణల కూల్చివేత కోసం పనిచేయనున్నారు. దీంతో హైడ్రా చర్యలు వేగవంతం కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *