– భారీగా తరలి వచ్చి ఓటేసిన గ్రావిూణులు
హైదరాబాద్, డిసెంబర్ 11: రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తయింది. పలుచోట్ల ఒంటిగంట వరకు క్యూలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయింది. రాత్రి వరకు పోలింగ్ ఫలితాలు ప్రకటించి ఉప సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు పోలింగ్‌ను పర్యవేక్షించారు. తొలి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా వీటిలో 396 సర్పంచ్ స్థానాలు, 9,633 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 3,834 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. 12,960 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడు విడతల పంచాయతీ ఎన్నికల కోసం 93,905 మంది సిబ్బందిని నియమించినట్టు ఎస్‌ఈసీ కమిషనర్ రాణికుముదిని పేర్కొన్నారు. 3,591 మంది రిటర్నింగ్ అధికారులను, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు చెప్పారు. వెబ్ కాస్టింగ్ ద్వారా 3,461 పోలింగ్ కేంద్రాలకు 45,086 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూన్లలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక గ్రామ పంచాయతీ, పది వార్డుల్లో ఎన్నికలను నిలిపివేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 56,19,430 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 27,41,070, మహిళలు 28,78,159, ఇతరులు 201 మంది ఉన్నారు.
బ్యాలెట్‌లో కనిపించని గుర్తు : వార్డు ఎన్నిక నిలిపివేత
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 11: జిల్లాలో ఓ వార్డులో ఓటింగ్ నిలిచిపోయింది. వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామ పంచాయతీలోని పదో వార్డులో అభ్యర్థికి గుర్తు కేటాయించలేదు. వార్డు సభ్యుడి ఎన్నికకు ముగ్గురు అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల సంఘం పంపిన బ్యాలెట్ పత్రాల్లో యాదయ్య అనే అభ్యర్థికి కేటాయించిన గుర్తు కనిపించలేదు. దాంతో ఓటర్లంతా షాక్ అయ్యారు. తనకు గుర్తు కేటాయించపోవడంతో ఆ అభ్యర్థి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.. దాంతో పోలింగ్‌ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





