రాయదుర్గంలో 17 కేజీల గంజాయి స్వాధీనం

– ఐటీ ఉద్యోగులకు సరఫరా చేస్తున్న నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19: రాష్ట్రంలో గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడోచోట ఆ నేరాలు జరుగుతూనే ఉండటం పోలీసులకు సవాల్‌గా మారింది. తాజాగా నగరంలోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐటీ ఉద్యోగులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు గంజాయి సరఫరా చేస్తున్న సోహెల్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 17 కేజీల గంజాయి, 2 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి గంజాయి తెచ్చి ఐటీ ఉద్యోగులకు సోహెల్‌ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడిరది. అతనితోపాటు గంజాయి వినియోగించిన అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *