– పట్టుబడ్డ వారిలో కీలక నేత చొక్కారావు?
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అనేకమంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లలో మృతిచెందగా, భారీ సంఖ్యలో లొంగిపోయారు. ఇప్పుడు తాజాగా మావోయిస్టు కీలక నేత పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. మావోయిస్టు అధినేత చొక్కరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యూ)లో 16 మంది మావోయిస్టులు పోలీసులకు చిక్కారు. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు ఉండగా 7 పురుషులు ఉన్నట్టు సమాచారం. అలాగే వారిలో మావో అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారందనీ హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నారు. మావోయిస్టులు పట్టుబడటంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.