పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులతో భేటీ
తమ ఎమ్మెల్యేలను ట్రాప్ చేసే పనిలో కెసిఆర్ అంటూ సంచలన ఆరోపణ
గెలిచిన అభ్యర్థులను నేడు బెంగళూరు తరలించే ఏర్పాట్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2 : నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలువెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్త్తుంది. ఈ క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ఆయన శనివారం డియాతో మాట్లాడుతూ…తెలంగాణలో కాంగ్రెస్ సునాయాసంగా అధికారంలోకి వొస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను ట్రాప్ చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, తమ పార్టీ అభ్యర్థులే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారని తెలిపారు. మరోవైపు నేడు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు హస్తం వైపే మొగ్గు చూపిన నేపథ్యంలో తాజా పరిస్థితులపై అలర్ట్ అయ్యింది. గెలిచిన తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చర్యలు చేపట్టింది. కొన్ని సంస్థలు హంగ్ వొస్తుందని అంచనా వేయగా, ఫలితం అలా వొచ్చినా ఏం చేయాలనే దానిపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను రంగంలోకి దించింది. తెలంగాణ ఎన్నికల ఫలితాల పర్యవేక్షణ బాధ్యతలను ఆయనకు అప్పగించింది. దీంతో శనివారం రాత్రి డీకే హైదరాబాద్‌కు చేరుకున్నారు. 2 రోజుల పాటు ఆయన ఇక్కడే ఉండనున్నట్లు తెలుస్తుంది.
అయితే గెలిచిన ఎమ్మెల్యేలను ఎక్కడికి తరలించబోమని, ఆ అవసరం రాదని ఇప్పటికే డీకే స్పష్టం చేసినా లోలోపల వారిని వెంటనే బెంగళూరుకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది. గెలుపు అవకాశాలున్న నేతలకు ఆయన ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే మొదట అభ్యర్థులందరిని హైదరాబాద్‌కు పిలిపించుకుందామని లనుకున్నా వాళ్లు కౌంటి ప్రక్రియ కొనసాగే సమయంలో అభ్యర్థులు వారివారి నియోజకవర్గాలలో ఉండడమే మేలన్న అధిష్టానం సూచనలతో వారికి తమతమ నియోజక వర్గాలలో ఉండమని ఆదస్త్రశాలు జారీ అయ్యాయి. నేడు సాయంత్రానికి గానీ గెలిచిన అభ్యర్థులు హైదరాబాద్ రేకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురి కాకుండా చూసుకునే బాధ్యతను డీకే తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో నెగ్గిన అభ్యర్థులు చేజారిపోకుండా అందరినీ ఏకతాటిపై ఉంచడంలో ఎక్స్ పర్ట్, పాలిటిక్స్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన ఆయనను ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ ఆయన సేవలను మరోసారి కాంగ్రెస్ అధిష్టానం వినియోగించుకుంటుంది. తాము గెలిచామనే ప్రకటన వొచ్చేంత వరకూ, కొత్త ప్రభుత్వం కొలువుదీరేంత వరకూ పూర్తి బాధ్యతలను డీకే పర్యవేక్షించనున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల ఫలితాల రోజున టీకాంగ్రెస్ బిగ్ ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రతి నియోజకవర్గంలో ఏఐసీసీ ఓ పరిశీలకుడిని నియమించనుంది. సదరు అభ్యర్థి విజయం సాధించాక వారితో డీకే ఓ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ సంపూర్ణ మెజార్టీ వొస్తే ఇబ్బందే లేదు. లేకుంటే అమలు చేయాల్సిన వ్యూహాలపై పార్టీ సీనియర్ నేతలు, గెలుపొందిన అభ్యర్థులతో చర్చించనున్నట్లు సమాచారం.





