కాంగ్రెస్ మేనిఫెస్టోపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 5 : కాంగ్రెస్ ప్రకటించిన హావ్నిలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో నోట్ల ముద్రణ ఏమైనా చేస్తారేమో… తెలియడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యంగ్యా స్త్రాలు సంధించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి స్పందిస్తూ..ముందుగా శాసనసభ ఎన్నికల్లో డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన అనేక హావ్నిలను కాంగ్రెస్ అమలు చేయాలన్నారు.
యూత్ డిక్లరేషన్, మహిళ డిక్లరేషన్, ఎస్సీ.. ఎస్టీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హావ్నిలు అమలు చేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హావ్నిలు ముందుగా అమలు చేయాలన్నారు. దళితుడని బాబూ జగ్జీవన్ రామ్‌ను ప్రధాని కాకుండా కాంగ్రెస్ అడ్డుకుందన్నారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలను జగ్జీవన్ రామ్ వ్యతిరేకించారన్నారు. ప్రజల హక్కులను పరిరక్షించ టానికి జగ్జీవన్ రామ్ పోరాటం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.




