సెప్టెంబర్‌లో రాష్ట్ర పర్యటనకు రాహుల్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : సెప్టెంబర్‌లో మరోసారి రాష్ట్రానికి కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్య నేత రాహుల్‌ ‌గాంధీ రానున్నారు. మంత్రి కేటీఆర్‌ ‌నియోజకర్గమైన సిరిసిల్లలో సెప్టెంబర్‌ 17‌న ఆయన పర్యటించనున్నారు. అక్కడి నుంచే విద్యార్థి యువజన డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌ ‌రెడ్డి పగ్గాలు చేపట్టాక ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ ‌పార్టీలోకి చేరికలు పుంజుకుంటున్నాయి. ఇక ముందు కూడా తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలకు రంగం సిద్ధమైంది.

కాంగ్రెస్‌ ‌పార్టీలోకి వివిధ పార్టీల నుంచి చేరేందుకు పలువురు ముఖ్య నేతలు సముఖత వ్యక్తం చేస్తున్నారు. భారీ జాబితాకు నాయకత్వం రూపు కల్పన చేసింది. జాబితాలో వివిధ పార్టీలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. విడతల వారీగా చేరికలు ఉండేలా నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. సెప్టెంబర్‌ 17‌న తెలంగాణకు రాహుల్‌  ‌రానున్న నేపథ్యంలో ఆయన సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలుంటాయని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *