సిరిసిల్ల ప్రజలు తలెత్తుకునేలా పనిచేశా..

కరెంటు కావాల్నా..కాంగ్రెస్‌ ‌కావాల్నా, నీళ్లు కావాల్నా..కన్నీళ్లు కావాల్నా ఆలోచించాలి
కెసిఆర్‌ ఎన్నడూ కులం, మతం కుంపట్లు పెట్టి వోట్లు అడుగలేదు
సిరిసిల్లలో నామినేషన్‌ ‌పత్రాలను దాఖలు చేసిన మంత్రి కేటీఆర్‌

‌రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, నవంబర్‌ 9 : ‌సిరిసిల్ల జిల్లా ప్రజలు తల ఎత్తుకునే విధంగా తాను పనిచేసానని, ఎట్లున్న సిరిసిల్ల ఇప్పుడు ఎలా అయిందనేది ఆలోచన చేయాలని మంత్రి కెటిఆర్‌ ‌నియోజకవర్గ ప్రజలను కోరారు. రాష్ట్రంలో సిరిసిల్ల అభివృద్ధిలోనే ముందున్నదని, కేసీఆర్‌ ఆశీర్వాదంతో తొమ్మిది ఏండ్లు మంత్రిగా పనిచేసానని, గౌరవ మెజారిటితో తిరిగి గెలిపిస్తారని తనకు నమ్మకం ఉందన్నారు.  గురువారం సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌తన నామినేషన్‌ ‌పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్‌ ఐదోసారి బరిలో నిలిచారు. అనంతరం కెటిఆర్‌ ‌మాట్లాడుతూ..వారే క్యాడిండెట్‌లు అనే విధంగా ప్రజలు నాలుగుసార్లు తనను గెలిపించారన్నారు. ఇంటింటికి ప్రగతి నివేదికలు పంపుతామన్నారు. తాను సిరిసిల్లకి ఏం చేసాను..కాంగ్రెస్‌, ‌బీజేపీలు ఏం చేశాయో చూడాలన్నారు. రాజీలేని పొరాటం చేస్తున్న కేసీఆర్‌పై కాంగ్రెస్‌, ‌బీజేపీ దండయాత్రకు వొస్తున్నాయని మండిపడ్డారు. గుజరాతీ వారు దండయాత్ర చేయడానికి వొస్తే ఊరుకుందమాఅంటూ ప్రశ్నించారు. చేవలేని, సాతగాని వాళ్లు బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు కావాలా, కాంగ్రెస్‌ ‌కావాలా..కన్నీళ్ళు కావాలా..నీళ్లు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు.

సీఎం కేసీఆర్‌ ఎన్నడూ కులం, మతం పేరుతో కుంపట్లు పెట్టలేదని గుర్తు చేశారు. ఎన్నికలు రాగానే కులం, మతం అంటున్నారు. కులపిచ్చి, మతపిచ్చి ఉన్న నాయకులు మనకు అవసరమా…అని కెటిఆర్‌ ‌సూటిగా ప్రశ్నించారు. దిల్లీ వాడు వొచ్చి దండయాత్ర చేస్తుంటే ఊరుకుందమా? తాత్కలిక పైసలు, మందుకు లొంగిపోతే దీర్ఘకాలం బాధపడుతామన్నారు. తెలంగాణ గొంతుక పోగొట్టుకుంటే మళ్లీ బాధపడాల్సి వొస్తదని ఇంటి పార్టీ బీఆర్‌ఎస్‌ను గెలిపించుకుంటే కష్టాలు తీరుతాయన్నారు. నామినేషన్‌ ‌దాఖలు కంటే ముందు కేటీఆర్‌ ‌ప్రగతి భవన్‌లో ప్రత్యేక పూజలు చేశారు.

2006 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించిన కెటిఆర్‌ ‌మొదటిసారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేశారు. సవి•ప ప్రత్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 171 వోట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాలతో తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి 2010 ఉప ఎన్నికల్లో బరిలో నిలిచారు. సవి•ప ప్రత్యర్ధి కేకే మహేందర్‌ ‌రెడ్డిపై 68,219 వోట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 జనరల్‌ ఎన్నికల్లో 53,004 వోట్ల మెజార్టీతో విజయం సాధించారు. తిరిగి 2018 ఎన్నికల్లో సవి•ప కాంగ్రెస్‌ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 89,009 వోట్ల భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *