సిబిఎస్‌ఇ ‌ఫలితాల వెల్లడి

న్యూ దిల్లీ, జూలై 22 : సెంట్రల్‌ ‌బోర్డ్ ఆఫ్‌ ‌సెకండరీ ఎడ్యుకేషన్‌ ‌సిబిఎస్‌ఈ 10, 12 ‌వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సిబిఎస్‌ఈ 12‌వ తరగతి, ఆ తర్వాత 10వ తరగతి ఫలితాలను సిబిఎస్‌ఈ ‌బోర్డు ప్రకటించింది.  10లో 94 శాతం మంది పాస్‌ ‌కాగా, 12లో 92.71 మంది విద్యార్థులు పాసయ్యారు.

ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు ద్వారా తెలుసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. వీటితోపాటు డిజిలాకర్‌, ‌పరీక్షా సంగమ్‌ ‌నుంచి కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ రూల్‌ ‌నంబర్లు, స్కూల్‌ ‌నంబర్లతో ఈ ఫలితాలను పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *