ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: ఉప్పల్ లో బీఅర్ఎస్ పార్టీ సంక్షేమ పలాలకు ఆకర్షితులై ప్రజలు మద్దతు పెరిగి భారీగా బలం చేకూర్తోందని ఉప్పల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.సోమవారం బీఅర్ఎస్ సీనియర్ నాయకులు పూడూరి జితేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో
బీఅర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఉప్పల్ టౌన్
కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు తిరునగరి అనిల్ కుమార్ ,కమల్, ఉప్పల్ సాయిబాబా కాలనీ మాజీ అధ్యక్షులు మర్పడగ రమాకాంత్ రెడ్డి,
, విజయపురి కాలనీవాసులు గొటికె రవీందర్ రెడ్డి, చంద్ర లకు బి ఆర్ ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.బీఅర్ఎస్
చిలుకానగర్ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు పండ్ల కిషన్ గౌడ్, సీనియర్ నాయకులు ఏ.బిక్కు, సీహెచ్ దయానంద్ సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరారు.




