వోటు హక్కును సక్రమంగా వినియోగించుకొవాలి

  • ఇవిఎంపై విస్తృతంగా అవగాహన
  • రాష్ట్ర సిఇఓ ఆదేశాల మేరకు కార్యక్రమాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 21 : నగర వోటర్లు తమ వోటు హక్కును సక్రమంగా వినియోగించుకొనుటకు ఎలక్ట్రానిక్‌ ‌వోటింగ్‌ ‌మిషన్‌(ఈవిఎం), వోటర్‌ ‌వెరిఫికేషన్‌ ‌పేపర్‌ ఆడిట్‌ ‌ట్రయల్‌(‌వివి ప్యాట్‌)‌లపై నియోజకవర్గ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు హైదరాబాద్‌ ‌జిల్లా పరిధిలో గల అసెంబ్లీ నియోజకవర్గంలో సంచార వాహనాలు ద్వారా  అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ స్థాయిలో ఈవియం వి వి ప్యాట్‌  ‌తో పలు ప్రాంతాల్లో వోటు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. రాబోయే ఎన్నికల నోటిఫికేషన్‌ ‌వచ్చే వరకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌ ‌జిల్లా ఎన్నికల అధికారి ఆయా నియోజకవర్గ స్థాయి ఎలక్ట్రోల్‌  అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రానిక్‌ ‌యంత్రాల ద్వారా జిహెచ్‌ఎం‌సి ప్రధాన కార్యాలయంలో  ఏర్పాటు చేసిన ఈ వి యం, వివి ప్యాట్‌  ‌ల ద్వారా ఓటు వేసే విధానం వి వి ప్యాట్‌ ‌యొక్క ఉపయోగం పై అవగాహన కల్పిస్తున్నారు. అదే విధంగా  స్టాటిస్టిక్స్ ఈవిఎం డెమో స్టేషన్‌ ‌సెంటర్‌ ‌లను ఏర్పాటు చేశారు.

ముషీరాబాద్‌ ‌నియోజకవర్గం పరిధిలో అబిడ్స్ ‌డిప్యూటీ కమిషనర్‌ ‌కార్యాలయంలో ఏర్పాటు చేశారు. మలక్‌ ‌పేట్‌ ‌నియోజకవర్గం లో నల్గొండ ఎక్స్ ‌రోడ్‌  ‌వద్ద గల డిసి ఆఫీస్‌, అం‌బర్‌ ‌పేట్‌ ‌నియోజకవర్గం జిహెచ్‌ఎం‌సి పార్కింగ్‌ ‌కాంప్లెక్స్, అబిడ్స్ ‌డి సి ఆఫీస్‌, ‌ఖైరతాబాద్‌ ‌నియోజకవర్గంలో జోనల్‌ ‌కమిషనర్‌  ‌కార్యాలయంలో గల జూబ్లీహిల్స్ ‌డిసి కార్యాలయంలో ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గం యూసుఫ్‌ ‌గూడ  డి సి ఆఫీస్‌  ‌కృష్ణకాంత్‌  ‌పార్క్ ‌దగ్గర, సనత్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గం సికింద్రాబాద్‌ ‌జోనల్‌ ఆఫీస్‌ ‌కాంప్లెక్స్,  ‌బేగం పేట్‌ ‌డి సి ఆఫీస్‌ ‌సిటీ సివిల్‌ ‌కోర్టు కాంప్లెక్స్  ‌మేరెడ్‌ ‌పల్లి  దగ్గర, నాంపల్లి నియోజకవర్గం ఖైరతాబాద్‌ ‌జోనల్‌ ‌కమిషనర్‌ ‌కార్యాలయంలో మెహిందీపట్నం రెండవ అంతస్తులో గల డి సి కార్యాలయం,  కార్వాన్‌ ‌నియోజకవర్గం ఖైరతాబాద్‌ ‌జోనల్‌ ఆఫీస్‌ ‌రెండవ అంతస్తు, గోషామహల్‌ ‌నియోజకవర్గం అబిడ్స్ ‌జిహెచ్‌ఎం‌సి కాంప్లెక్స్ ‌లో డిప్యూటీ కమిషనర్‌ ‌కార్యాలయం, చార్మినార్‌ ‌నియోజకవర్గం మొఘల్‌ ‌పుర డిప్యూటీ కమిషనర్‌ ‌కార్యాలయం, చాంద్రాయణగుట్ట నియోజకవర్గం చార్మినార్‌ ‌జోనల్‌ ‌కమిషనర్‌ ‌కార్యాలయం మూడవ అంతస్తు హఫీజ్‌ ‌బాబా నగర్‌ ‌వద్ద ఏర్పాటు జరిగింది.

యాకత్‌ ‌పుర నియోజకవర్గం జోనల్‌ ‌కమిషనర్‌ ‌కార్యాలయం రెండవ అంతస్తులో ఏర్పాటు చేయడం జరిగింది. బహదూర్‌ ‌పుర నియోజకవర్గం చార్మినార్‌ ‌జోన్‌ ‌కార్యాలయం నాలుగో అంతస్తులో ఏర్పాటు చేయడం జరిగింది.  సికింద్రాబాద్‌ ‌నియోజకవర్గం సికింద్రాబాద్‌ ‌జోనల్‌ ఆఫీస్‌ ‌మూడవ అంతస్తులో డెమో స్టేషన్‌ ‌లను ఏర్పాటు చేశారు. ఒకొక్క సెంటర్‌ ‌కు ఒక అధికారిని ఇన్‌ ‌చార్జిగా నియమించి ఓటర్లకు ఎలక్ట్రానిక్‌ ‌యంత్రాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమాలు ఎన్నికల నోటిఫికేషన్‌ ‌వచ్చే వరకు నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *