వోటు అనేది ప్రజా ఆయుధం

నేడే తెలంగాణలో శాసన సభ ఎన్నికలు

ప్రతి ఒక్కరికి ఎన్నికలంటే తెలియని ముచ్చట కాదు. నిజంగా చెప్పాలంటే వోటుతోనే అన్ని సాధ్యం.మనం బాగుపడాలన్నా మనం బీదరికంలో ఉండాలన్నా కూడా వోటుతోనే సాధ్యం.కావున మన వోటును పకడ్బందీగా వినియోగించుకోవాలి.తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది, చల్లారింది కూడా. నేతలంతా ప్రచారం చేసి ప్రజలకు దగ్గరయ్యారు.ఒక్కొక్కరు ఒక్కో నినాదంతో ముందుకు వచ్చారు.అవన్నీ ప్రజలమైన మనం విన్నాం.వినడం ఒక ఎత్తు అయితే విన్నదాంట్లో ఎవరు మంచి చెప్పారు,ఎవరు మంచి చేసే వాళ్లు అనేది మనం గ్రహించాలి.ప్రచారాలలో తిరిగినవాళ్ళే తమ అభ్యర్థికే వోటు వేస్తారన్న నమ్మకం,ఆశ అంతకన్నా లేనే లేదు. కావున వోటు అనేది చాలా కీలకమైన అంశం.ఈ కాలంలో వోటు విలువ అనేది క్రమక్రమేణా తగ్గుతూ వస్తుంది.వోటును డబ్బు అనే చెట్టుకు కట్టేసి నాయకులంతా రాజ్యాన్ని ఏలుస్తున్నారు ఒక వైపు  కూల్చివేస్తున్నారు. వోటు అంటే ఎంత ఇస్తావు అన్న కాడికి వచ్చింది ప్రస్తుతం.అంటే మనం ఎంతకీ దిగజారిపోయామనేది దీన్ని బట్టి అర్థమవుతుంది.

ఎందుకంటే సమాజమే డబ్బు అని మంత్రంలో మునిగిపోయింది.అది మన ప్రజల డబ్బే కాబట్టి తీసుకోవడం తీసుకోకపోవడం మనిష్టం. డబ్బు విషయం పక్కన పెడితే పక్కగా  ఇతనితో మార్పు వస్తుంది, ఇతని వలన అభివృద్ధి జరుగుతుందనుకునే నాయకుడు ఒక్కరు పక్కా ఉంటారు. అతనికి మాత్రం ఓటేయండి. మనం కొన్ని విషయాలను గమనించుకోవాలి.మనకు జరిగిన అభివృద్ధిని చర్చించుకోవాలి, ఇంకా ఎలాంటి పనులు పెండిరగ్లో ఉన్నాయని కూడా గమనించాలి. ఎన్నికలు అనేవి ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి.నీ వోటును అమ్ముకుంటే 5 సంవత్సరాలు నరకం అనుభవించాల్సిందే. ప్రతి నాయకుడు డబ్బుతో ప్రజల వోటును కొనాలని అనుకుంటున్నారు. ప్రతి రాజకీయ నాయకుడు ఇదే ఆలోచిస్తున్నాడు. ఏ ప్రజా ప్రతినిధి అయిన ప్రజల పక్షాన పోరాటం చేయాలే కానీ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. వోటు  అనేది ఎంత కీలకమైనదనేది మనకందరికీ తెలిసిందే.కావున ప్రతి ఒక్కరూ వోటు హక్కును వినియోగించుకోవాలి. ఎవరు కూడా వోటును వృధా చేసుకోవద్దు ఆలోచించి పదిమందికి అవగాహన కల్పించి వోట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. కాపాడుతారని ఆశిస్తూ ఉన్నాను. మనం పక్కాగా మార్పు కోరుకోవాలంటే మనకు నచ్చిన నాయకుడికి వోటు వేసి వోటు యొక్క గొప్పతనాన్ని చాటుకోవాలి.
వోటుకు నోటు వద్దు
ప్రజాస్వామ్య పరిరక్షణ ముద్దు

వెంగల రణధీర్‌
జయశంకర్‌ భూపాలపల్లి
9949493707

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *