వాగ్దానాల అమలుకే ప్రజాపాలన

సిద్దిపేట,ప్రజాతంత్ర, జనవరి 3: నంగునూర్ మండలంలోని నాగరాజు పల్లి, అప్పలచెర్వు,  పాలమాకుల, మగ్దూంపూర్ గ్రామలలో  బుధ వారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన వాగ్దానాల అమలు కోసమే ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. రూ.16కో ట్ల మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం గత పాలకుల అసమర్థ పాలనతో నేడు 7లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మారిందన్నారు. ఇది దొరల ప్రభుత్వం కాదని ప్రజల ప్రభుత్వం అని, అర్హులంద రికీ సంక్షేమ పథకాలు ఇస్తామని అన్నారు. తొమ్మిదీన్నర సంవత్సరాలలో గత ప్రభుత్వం ప్రజా సంక్షేమ మాన్ని పూర్తిగా విస్మరించ్చిందని గుర్తు చేశారు. ఒక్కరికి కూడా రేషన్కార్డు ఇవ్వని ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని, పేదలకు పంచిన భూములను లాక్కుందని మండిపడ్డారు.ఈ కార్యక్రమం లో తహసీల్దార్ అనీల్ కుమార్ , ఎంపీడీఓ  వేణుగోపాల్ రావు,రెవిన్యూ ఇన్స్పెక్టర్ లింగం యాదవ్  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అచ్చిన సత్తయ్య, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రంగు అశోక్ గౌడ్, నాగరాజు పల్లి మాజీ సర్పంచ్ చేర్యాల బాలయ్య, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు రాగుల కనకయ్య,జంగిటి శ్రీనివాస్,జాప తిరుపతి, జైనశ్రీనివాస్,రాములు,  దేవులపల్లి ప్రసాద్, చింటూ, శ్రీకాంత్,హరీష్, కృష్ణ, రాజు, లతో పాటు ఆ గ్రామల సర్పంచ్ లు ప్రజలు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *