వందశాతం మురుగునీటి శుద్ధి

  • రూ.3,866 కోట్లతో 31 కేంద్రాల ఏర్పాటు
  • కోకాపేట మురుగునీటి శుద్ది కేంద్రాన్ని
  • ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : ఈ ఏడాది సెప్టెంబర్‌ ‌నాటికి హైదరాబాద్‌లో వందశాతం సివరేజ్‌ ‌ట్రీట్‌మెంట్‌  ‌చేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మురుగునీటిని శుద్ధిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. రూ.3,866 కోట్లతో 31 మురుగునీటి శుద్ధి కేంద్రాలు  ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో  రూ.66.16 కోట్ల వ్యయంతో 15 ఎంఎల్డీల సామర్థ్యంతో నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ఎస్టీపీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో మురుగునీటి శుద్ధి కోసం చేసిన ప్రణాళికలు అందుబాటులోకి వొస్తున్నాయన్నారు. అందులో మొదటి ఎస్టీపీ ఇప్పుడు కోకాపేటలో ప్రారంభించినట్లు చెప్పారు. దేశంలోనే ముఖ్యమైన నగరాలు 40 శాతం కూడా శుద్ధి చేయడం లేదన్నారు. సెప్టెంబర్‌ ‌నాటికి నగరంలో 100 శాతం మురుగు నీటి శుద్ధి చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఎస్టీపీల నిర్మాణానికి కేంద్రాన్ని నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. 850 కోట్ల రూపాయల విలువైన ఉచిత నీటిని ఇప్పటి వరకు హైదరాబాద్‌ ‌నగరంలో పంపిణీ చేసామని చెప్పుకొచ్చారు.

నగరంలో ప్రతీ మురుగు నీటిని శుద్ది చేస్తామని మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. దేశంలోనే వందశాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా, నిర్మాణ పనులు పూర్తయిన చోట ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 31 ఎస్టీపీల పనుల్లో కోకాపేట ఎస్టీపీ నిర్మాణం పూర్తయింది. దీంతో దానిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక 7 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నిర్మించిన దుర్గం చెరువు ఎస్టీపీ ట్రయల్‌ ‌రన్‌ ‌విజయవంతమయింది. ఎస్టీపీలలో తొలి ఫలితం కోకాపేట కావడం గమనార్హం. వొచ్చే వారంలో దుర్గం చెరువు ఎస్టీపీని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా, వొచ్చే సెప్టెంబరు నాటికల్లా 31 ఎస్టీపీలన్నీ అందుబాటులోకి వొచ్చేలా అధికారులు పనులు వేగిరం చేశారు.రూ. 66.16 కోట్లతో 15 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఎస్‌బీఆర్‌ ‌టెక్నాలజీతో ఈ కోకాపేట ఎస్టీపీ నిర్మాణం జరిగింది. 14 వి•టర్ల పొడవు, 6 వి•టర్ల వెడల్పుతో ఇంటరాప్షన్‌ అం‌డ్‌ ‌డైవర్షన్‌ ‌పనులు చేపట్టారు. వట్టి నాగులపల్లి, తేజ్‌ ‌నగర్‌, ‌జర్నలిస్టు కాలనీ, గౌలిదొడ్డి, ఐఎస్‌బీ, ఫైనాన్షియల్‌ ‌డిస్ట్రిక్ట్, ఐటీ కాంపెనీలు విప్రో, మైక్రోసాప్ట్ ‌తదితర ప్రాంతాలలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కా రం లభించనుంది. కాగా, అధునాతన సీక్వెన్సింగ్‌ ‌బ్యాచ్‌ ‌రియాక్టర్‌ ‌టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణాలు జరుగుతున్నాయి. మెట్రో నగరాల్లో స్థలాభావం ఉంటుంది. కాబట్టి ఎస్‌బీఆర్‌ ‌టెక్నాలజీతో నిర్మాణం అనువుగా ఉంటుంది. వీటి వల్ల ఒకే ఛాంబర్లో ఐదు స్టేజీల మురుగునీటి శుద్ధి పక్రియ జరిగి, తకువ విస్తీర్ణంలో ఎకువ నీటిని శుద్ధి చే స్తాయి. దేశంలో వినియోగిస్తున్న వివిధ బయోలాజికల్‌ ‌ట్రీట్‌మెం ట్‌ ‌పద్ధతుల కం టే ఈ ఎస్‌బీఆర్‌ ‌విధానానికి త కువ ఖర్చు అవడంతో పాటు మెరుగ్గా మురుగునీటి శుద్ధి జరుగుతుంది. ఇది తేలికైన విధానం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *