రేవంత్‌ మంత్రివర్గంలో మంత్రులకు శాఖల కేటాయింపు

భట్టికి రెవెన్యూ…ఉత్తమ్‌కు హోమ్‌…శ్రీధర్‌ బాబుకు ఆర్థిక..

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : రాష్ట్ర సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక..తనతో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు.  ఈ క్రమంలో మంత్రులందరికీ సీఎం శాఖలను కేటాయించారు. సిఎం సూచనలతో గవర్నర్‌ తమిళి సై ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో భాగంగా డిప్యూటి సిఎం భట్టి విక్రమార్కకు రెవెన్యూ, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి హోమ్‌ శాఖ, ఆర్థిక శాఖను దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుకు, కోమటిరెడ్డి వెంటకరెడ్డికి పురపాలక శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు, భవనాలు, పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఇరిగేషన్‌ శాఖ, సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ, జూపల్లి కృష్ణారావుకు పౌర సరఫరాల శాఖ, పొన్నం ప్రభాకర్‌కు బీసీ సంక్షేమ శాఖ, కొండా సురేఖకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, దామోదర రాజనర్సింహకు ఆరోగ్య శాఖను కేటాయించారు. ఈ మేరకు మంత్రులు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. తమకు కేటాయించిన ఛాంబర్లలో చేరుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *