మైనార్టీ స్కాలర్‌షిప్‌ల నిలిపివేత తగదు

రాజ్యసభలో బిఆర్‌ఎస్‌ ఎం‌పి సురేశ్‌ ‌రెడ్డి ప్రస్తావన
న్యూ దిల్లీ, డిసెంబర్‌ 22 : ‌మైనార్టీలు, ఓబీసీలకు ప్రీ మెట్రిక్‌ ‌స్కాలర్‌షిప్‌లు నిలిపివేత అంశంపై రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ ఎం‌పీ కేఆర్‌ ‌సురేశ్‌ ‌రెడ్డిప్రస్తావించారు. విద్యతోనే సమానత్వం సాధించవచ్చు అని, ప్రైమరీ-ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌పై ఢిల్లీ డిక్లరేషన్‌ ‌గుర్తు తెచ్చుకోవాలన్నారు. సమాజంలో ఉన్న బలహీన వర్గాల ప్రజలకు విద్యను అందించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయన్నారు. మైనార్టీలకు, ఓబీసీలకు స్కాలర్‌షిప్‌లను నిలిపివేయడం శోచనీయమన్నారు. మైనార్టీలు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారన్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం గవర్నమెంట్‌కు భారం కాదన్నారు.

ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ప్రీ మెట్రిక్‌ ‌స్కాలర్‌షిప్‌లను రద్దు చేసినట్లు సురేశ్‌ ‌రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది విద్యార్థులపై ప్రభావం పడిందన్నారు. సబ్‌ ‌కాసాత్‌.. ‌సబ్‌ ‌కా వికాశ్‌ ‌గురించి చెప్పే ప్రభుత్వం.. మైనార్టీలను వదిలివేస్తోందని సురేశ్‌ ‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర సర్కార్‌ ‌మైనార్టీ స్కాలర్‌షిప్‌ల నిర్ణయాన్ని పునర్‌ ‌పరిశీలించాలని, మైనార్టీలు కూడా సమాజంలో భాగమన్నారు. స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం వల్ల విద్యా వ్యవస్థను బలోపేతం చేయవచ్చు అని తెలిపారు. కానీ స్కాలర్‌షిప్‌ ‌వ్యవస్థను రద్దు చేస్తే .. మైనార్టీలకు నష్టం జరుగుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *