మహాలక్ష్మి అద్భుతంగా అమలు: ఆర్టీసీ ఎండి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకున్న మహాలక్ష్మి పథకం అద్భుతంగా అమలవుతుందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ‌తెలిపారు. మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేసేటప్పుడు ఒరిజినల్‌ ‌గుర్తుంపు కార్డు తీసుకొని సిబ్బందికు సహకరించాలని ఎండీ సజ్జనార్‌ ‌కోరారు. మియాపూర్‌ ‌డిపో 2లో ఘనంగా వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ‌హాజరయ్యారు.

అనంతరం విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ‌మాట్లాడుతూ .. ఆర్టీసీలో వనభోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఉద్యోగులంతా స్నేహపూర్వక వాతావరణంలో కలిసి వనభోజనాలు కార్యక్రమం చేసుకోవడం మంచి పరిణామమని చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ‌డీసీపీ ట్రాఫిక్‌ ‌వేణుగోపాల్‌, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *