మంత్రి గన్ మెన్ ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించాలి

•డిబిపి జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్
హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 05 : రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఎస్కార్ట్ గన్ మన్ ఫజల్ సూసైడ్ పైన విచారణ జరిపించాలని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు, సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోమ్ మంత్రిలను ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేసారు.
రాష్ట్ర మంత్రికి సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న అధికారే ఆత్మ హత్య చేసికున్నారంటే రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని ఆరోపించారు. పూర్తి స్థాయి విచారణ చేయకుండా ఆర్ధిక ఇబ్బందులు కారణం అని నిర్ధారణకు రాకూడదని పోలీస్ శాఖకు సూచించారు.ఈ ఘటన మీద ఐపీఎస్ రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారి చేత విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. నిజంగా బ్యాంకు అధికారుల వేధింపులు వల్ల సుసైడ్ చేసికుంటే బాద్యులు అయిన బ్యాంకు అధికారులను తక్షణమే అరెస్ట్ చేయాలని తెలంగాణ డీజీపీని కృష్ణ స్వరూప్ డిమాండ్ చేసారు. ఫజిల్ కుటుంబం సభ్యులకు రూ.10 కోట్ల ఎక్స్ గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలన్నారు. ఫజల్ పెద్ద కూతురు ఫాతిమాకు గజిటెడ్ స్థాయి పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం తక్షణమే ఇవ్వాలని ప్రభుత్వంను కోరారు. ఈ సుసైడ్ ఘటనతో ప్రజల మనస్సు కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఘటన మీద తెలంగాణ హోమ్ మంత్రి మహమూద్ అలీ నోరు విప్పాలని కృష్ణ స్వరూప్ డిమాండ్ చేసారు. మంత్రి ఎస్కార్ట్ అధికారి ఫజిల్ ఆత్మ హత్యకు పాల్పడటమా లేక మంత్రి ఉన్నత పోలీస్ అధికారుల వేధింపులా? ఆర్ధిక బ్యాంకు అధికారులు వేధింపులా? కారణాలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకూ చెప్పాలని రాష్ట్ర హోమ్ శాఖ అధికారులను కృష్ణ స్వరూప్ డిమాండ్ చేసారు. ఫజిల్ మృతి పట్ల తీవ్రంగా విచారం వ్యక్తం చేసారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *