భూకబ్జాదారుల నుంచి భద్రాచలాన్ని కాపాడండి

  • అన్ని రాజకీయ పార్టీలది అదే రీతి
  • మార్చుకోకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదు
  • లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్శదర్శి ఆజాద్‌

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 07 : భద్రాచలం పట్టణంలో ఐటీడీఏ వెనక చెరువు సర్వే నెంబర్‌ 111 /5 ‌లోగల 1.15 ఎకారాల ప్రభుత్వ భూమిని వివిధ రాజకీయ పార్టీల నాయుకులు, స్థానిక రెవిన్యూ, పోలీసుల సమన్వయంతో భోగాల శ్రీనువాసురెడ్డి (కాంగ్రెస్‌ ‌పార్టీ), కొడాలి శ్రీని వాసు రావు (టిడిపిపార్టీ), రావులపల్లి రాంప్రసాద్‌ (‌సిపిఐ), స్థానిక తహశీల్దార్‌ ‌శ్రీవాస రావు ఆక్రమంగా కబ్జా చేశారని పేర్కొంటూ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆజాద్‌ ‌మంగళవారం నాడు లేఖ విడుదల చేసారు. రాజుపేట కాలనీలో చైతన్య స్కూల్‌ ఎదురుగా పాల్‌ ‌రాజు స్థాపించిన క్రిస్టియన్‌ ‌సంస్థలకు సంబంధించిన సర్వే నంబర్‌ 52/2, 52/46, 53/5/2 ‌లో గల 3 ఎకరాల భూమి వాసిరెడ్డి దుర్గయ్య(ఎటపాక) సంబంధించిన 3 ఎకరాల భూమి మొత్తం 6. ఎకారాలు రావులపల్లి రాంప్రసాద్‌  ఆ‌క్రమంగా అక్రమించి కబ్జాచేసి పట్టా చేయించుకున్నారని లేఖలో పేర్కొన్నారు. వీళ్ళంతా స్థానిక ఎమ్మెల్యేను అడ్డం పెట్టుకొని, స్థానిక మంత్రి బంధువునని చెప్పుకుంటూ ఆదివాసి సంఘాలపైన ఒత్తిడి తెచ్చి భూముల కబ్జాలకు పాల్పడుతున్నారని లేఖలో తెలిపారు.

ఇలాంటి దోపిడి దౌర్జన్యలకు వ్యతిరేకంగా తమదైన పద్దతులలో ఆదివాసీ సంఘాలు జుల్‌-‌జంగిల్‌ ‌జమీన్‌ ‌కోసం కోమరం భీమ్‌ ‌లాగా భూముల స్వాధీనం కోసం సాయుధ పోరాటం చేసి తమ ప్రాంతాలలో ఉత్పత్తి వనరులను రక్షించుకుంటూ ప్రజల ప్రమేయంతో ప్రజలకోసం పోరాడాలని లేఖలో పిలుపునిచ్చారు. దండకార్యణంలోని జనతన సర్కాల్‌ ‌తరహాలో పోరాటం చేసి రాజకీయ పార్టీల నాయకులు కబ్జాచేసిన భూమిని తిరిగి భూమి లేని నిరు పేద ఆదివాసీ ప్రజలకు పంచాలని లేఖ ద్వారా కోరారు. ఆదివాసీ ప్రజలు భూస్వాధీనం కోసం సాయుధ పోరాటం ద్వారా స్వాధీనం చేసుకోవాలని పిలుపునిస్తున్నాం. మీ పోరాటలకు మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఇలాంటి పోరాటలకు అడ్డు వొచ్చే రాజకీయ పార్టీల నాయకులను ప్రజా కోర్టులలో విచారించి తగిన శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *