భారతదేశానికి 2024 కీలకమైనది

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

తిరుమల, జనవరి 1 : భారతదేశానికి 2024 కీలకమైన ఏడాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం తిరుమల శ్రీవారిని ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ద్వారా దర్శన అనంతరం ఆలయం వెలుపల కిషన్‌రెడ్డి విూడియాతో మాట్లాడుతూ…2024లో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ కీలక పాత్ర పోషించనుందన్నారు. ఇజ్రాయెల్‌`గాజా, రష్యా`ఉక్రెయిన్‌ వంటి ప్రపంచ దేశాల సమస్యలు ఈ ఏడాదిలో పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. అందులో భారత్‌ కీలక పాత్ర షోషించనుందని చెప్పారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఈ ఏడాదిలోనే జరగనుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *