హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : మహా శివరాత్రి సందర్భంగా శ్కెవ క్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగు తున్నాయి. శివుడిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. హైదరా బాద్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శివరాత్రి సందర్భంగా పూజలు నిర్వహించారు. శ్రీశ్కెలం, శ్రీకాళహస్తి, కాళేశ్వరం, వేములవాడ, కీసరగుట్ట తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడ రాజన్న క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మార్మోగిపోతోంది.
భక్తులు స్వామివారికి కోడె మొక్కలు చెల్లించి.. దర్శనానికి క్యూ ల్కెన్లో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఆలయ అర్చకులు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాళేశ్వరం క్షేత్రంలో మహాశివరాత్రి శోభ కనిపిస్తోంది. తెలంగాణతో పాటు పొరుగున ఉన్న మహరాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు కాళేశ్వరానికి తరలివస్తున్నారు. త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించి.. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి మారేడు దళాలు సమర్పించి.. అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తున్నారు.





