బస్సు ప్రమాదంపై సిఎం కెసిఆర్‌ ‌దిగ్భ్రాంతి

  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
  • మృతులకు ఒక్కొక్కరికి లక్ష సాయం ప్రకటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 3 : ‌కర్నాటకలో బస్సు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ ‌దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. కర్నాటక ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబానికి లక్ష, క్షతగాత్రులకు 50వేల పరిహారం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *