బట్ట కాల్చి విదేస్తున్న బిజెపి నేతలు

  • సిఎం కెసిఆర్‌ ‌కూతురును బద్నాం చేసే కుట్ర
  • దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌తో నాకెలాంటి సంబంధం లేదు
  • ఏ దర్యాప్తు చేసుకున్నా అభ్యంతరం లేదు
  • విడియాతో ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత
  • కేంద్రాన్ని విమర్శిస్తూనే ఉంటామని హెచ్చరిక

రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌బట్టకాల్చివి•ద వేయడం బీజేపీ పని అంటూ  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యక పరిణామం కాదన్నారు. దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని కల్వకుంట్ల కవిత విమర్శంచారు. రంగారెడ్డి జిల్లా ఎలిమనేడులో ఎమ్మెల్యే మంచిరెడ్డి  కిషన్‌రెడ్డి నాలుగు రోజులుగా సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు కవిత యాగానికి హాజరయ్యారు. అనంతరం విలేఖరులతో కవిత మాట్లాడారు. దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కేసీఆర్‌ ‌బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్‌ ‌భయపడుతారేమో అని చూస్తున్నారని, ఇది వ్యర్థ ప్రయత్నమే తప్ప ఇలాంటి వాటికి కేసీఆర్‌ ‌భయపడరన్నారు. ఏ విచారణ అయినా కేంద్రం చేసుకోవచ్చని చెప్పారు. లిక్కర్‌ ‌స్కామ్‌పై ఏ దర్యాప్తు సంస్థతో అయినా విచారణ చేయించినా తాము సహకరిస్తామన్నారు. ఇటువంటి ఆరోపణలకు, విమర్శలకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు.

ప్రశ్నించే వాళ్లపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బీజేపీ ఎంపీ తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని చెప్పారు. తమను మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావన్నారు. బీజేపీ పాలసీలను ప్రశ్నిస్తున్నందుకే తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు. కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే తన పేరును లిక్కర్‌ ‌స్కామ్‌లో తెరపైకి తీసుకొచ్చారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీజేపీ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. తాను మానసికంగా కుంగిపోతానని అనుకుంటున్నారని, కానీ ఆరోపణలను సహించేది లేదన్నారు. బిల్కిస్‌ ‌బానో, ఇతర అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. బిల్కిస్‌ ‌బానో, ఉద్యోగాలు లాంటి విషయాలపై జవాబు చెప్ప కుండా, ప్రతిపక్షాల వి•ద ఇలాంటి ఆరోపణలతో బురద చల్లాలనే వైఖరి బాగాలేదు..దీన్ని ప్రజలంతా గమనించాలన్నారు. కేంద్రంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు.

కేసీఆర్‌ను మానసికంగా వేధించాలంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం..ఎవరికీ భయపడేది లేదన్నారు. కేసీఆర్‌ ‌కుమార్తెను కాబట్టే తన పైనా ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎంత ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గేది లేదని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్‌పై అనేక ఆరోపణలు చేశారని, మొక్కవోని దీక్షతో సీఎం కేసీఆర్‌ ఉద్యమాన్ని నడిపించారన్నారు. మొక్కవొని ధైర్యంతో, మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వ్యక్తులం అన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని, భారతదేశం ఎలా అభివృద్ధి చెందాలి అనే కలతో, ఎజెండాతో సీఎం కేసీఆర్‌  ‌ముందుకెళ్తున్నారు. మేమంతా వారు చూపించిన బాటలోనే నడుస్తామని, భయపడేది లేదన్నారు.

దిల్లీ ఎక్సైజ్‌ ‌పాలసీ స్కాం వెనక తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యుల హస్తం ఉందని వెస్ట్ ‌ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్‌ ‌సాహిబ్‌ ‌సింగ్‌ ‌వర్మ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌తో తనకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పారు. తనను ఇబ్బంది పెట్టి సీఎం కేసీఆర్‌ను భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులపై గతంలో కూడా చాలా ఆరోపణలు వొచ్చాయని, కానీ వాటన్నింటికి ఎప్పుడూ భయపడ లేదని, దేశ అభివృద్ధిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్‌ ‌ముందుకెళ్తున్నారని, ఆయన వెంట తామంతా ఉంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌, ‌కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులు ఎలాంటి వారో తెలుసన్నారు. కొన్ని ఏజెన్సీలను, వి•డియా సంస్థలను వాడుకుని తమను టార్గెట్‌ ‌చేయాలనుకుంటున్నారని ఆరోపించారు.

బిజెపి నేతలపై కోర్టుకెక్కే ఆలోచనలో కవిత
దిల్లీ మద్యం విధానంలో తనపై నిరాధారణమైన ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేయనున్నారు. బీజేపీ ఎంపీ పర్వేష్‌ ‌వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్‌ ‌సిర్సాపై పరువు నష్టం దావా వేయడంతో పాటు నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వాలని కవిత కోర్టును ఆశ్రయించనున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో కవిత చర్చలు జరుపుతుండగా..తర్వాత కోర్టును వెళ్లనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *