పూట భోజనం లేకపోయినా బతుకచ్చమే కానీ సెల్ ఫోన్ చేతిలో లేకపోతే క్షణం గడవదు అయితే ఆ ఫోన్ మనిషి మనుగడకే ప్రమాదకరంగా మారింది …. ట్యాపింగ్ ట్యాపింగ్… కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. మోదీ సర్కార్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంటే… టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. ఎమ్మెల్యేల ఎర కేసు విషయంలోనూ ట్యాపింగ్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే ఈ మధ్య తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం.
ఫోన్ ట్యాపింగ్ అంటే… అనుమతి లేకుండా మరొకరి సంభాషణ వినడం లేదా చదవటం వంటివి చేస్తే దానిని ఫోన్ ట్యాపింగ్ అంటారు. దీన్నే వైర్ ట్యాపింగ్ అని కూడా అంటారు. ఉదాహరణకు.. మీరు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతుంటే మూడో వ్యక్తి మీ ఇద్దరి సంభాషణను రికార్డ్ చేస్తే లేదా చదివినట్లయితే ట్యాపింగ్ చేయటం అని అంటారు ఒక రకంగా మన రహస్యాలను బహిర్గత పరచడం అన్న మాట ఫోన్ ట్యాపింగ్, వైర్ ట్యాపింగ్ అని కూడా పిలుస్తారు, ఈ వ్యవహారఎం లో పాల్గొన్న పార్టీల అనుమతి లేకుండా టెలిఫోన్ సంభాషణలను వినడం లేదా రికార్డ్ చేయడం ద్వారా రహస్యంగా పర్యవేక్షించడం.వంటి విధానాలు ఇది న్యాయస్థాన ఉత్తర్వుతో చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు లేదా అనధికార వ్యక్తులు లేదా సంస్థల ద్వారా చట్టవిరుద్ధంగా చేయవచ్చు. ఫోన్ ట్యాపింగ్ అనేది గోప్యత మరియు పౌర హక్కుల గురించి ఆందోళన కలిగించే వివాదాస్పద మైన పద్ధతి. ఇది వివిధ అధికార పరిధిలో వివిధ చట్టాలు మరియు నిబంధనలకు లోబడి ఉంటుంది.
రాష్ట్రాల పరిధిలో చూస్తే ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇక కేంద్రం పరిధిలో చూస్తే… ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ), డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, దిల్లీ పోలీస్ కమిషనరేట్ ఉన్నాయి.ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు.. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు మూడు నుంచి నాలుగు వర్క్ స్టేషన్లు, డెస్క్ టాప్ మానిటర్లు, హెడ్ ఫోన్లతో కూడిన ఒక గది ఉంటే చాలు. ఈ గది మొత్తాన్ని సీసీ టీవీ కెమెరా నిఘాలో ఉంచుతారు.
సెట్టింగ్స్ ను.. వీటితో పాటు సెల్ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు సరిపడ సర్వర్లు, రికార్డింగ్ పరికరాలు, టెలికం సర్వీస్ ప్రొవైడర్లు మరియు వీటికి సరిపడా కేబుల్స్ ఉంటే చాలు. ఫోన్ ట్యాపింగ్ చేయడం సులభమే, ఏసీబీ అధికారులు పటిష్ట మైన టెలికాం వ్యవస్త ద్వారా ఏసీబీ అధికారులు తమకు కావలనుకున్న వారి సంభాషణలను రికార్డు చేస్తారు.
మన దేశంలో చూస్తే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ – 1885 ప్రకారం ఫోన్ ట్యాపింగ్ గురించి చెబుతుంది. ఈ చట్టంలోని సెక్షన్ – 5(2) ప్రకారం… దేశ సార్వభౌమత్వం, సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజాశ్రేయస్సు వంటి అంశాల్లో రాష్ట్రాలు లేదా కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేసే వీలు ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి పెద్ద ప్రక్రియే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000లోని సెక్షన్ 69 కూడా ట్యాపింగ్ కు సంబంధించి పలు అంశాలను చెబుతోంది. ఇక కాల్స్‌ను రికార్డు చేయడానికి లేదా ఇంటర్‌సెప్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ విషయంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం విషయంలో రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి.
ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు కూడా ప్రత్యేక సాఫ్ట్ వేర్లు రూపొందించి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 26 (బి) ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్‌కు గరిష్ఠంగా మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు. ఇలా చేస్తే పౌరుడి గోప్యత హక్కును ఉల్లంఘించటం కిందకు వస్తుంది. పెగాసెస్ అనే ఇజ్రాయేల్ స్పైవేర్‌తో భారత్‌లోని మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై నిఘా పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయంలో ప్రస్తుతం ఉన్న ఏపీ సర్కార్… విచారణ కూడా జరుపుతోంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఈ పెగాసెస్ ను ఉపయోగించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సాఫ్ట్ వేర్ పై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా పలు ఆరోపణలు చేశారు. నెట్వర్క్ పరికరాల మరియు ఫోన్ టాపింగ్ వ్యవస్థ ఖరీదు రూ. 10 నుంచి 15 లక్షల వరకూ ఇలా మరియు రికార్డు చేసే ఒక్కో సర్వర్ ఖరీదు సుమారు రూ. 10 నుంచి 15 లక్షల వరకూ ఉంటుంది. ఇవి మాత్రమే కాదు ‘స్టింగ్ రే పరికరాలు’ మరియు వాటిని ఉపయోగించే నెట్వర్క్ రహస్య సిండ్రోమ్ ద్వారా మరియు పటిష్టమైన నెట్వర్క్ ద్వారా కూడా ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు.
ఈ వ్యవహారం అధికారులకే సాధ్యం మన దేశంలో సీబీఐ, రా, ఐబీ, ఈడీ, జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఆదాయపన్ను విభాగం, రాష్ట్ర పోలీసు విభాగం అధికారులు మాత్రమే వీటి ద్వారా ట్యాపింగ్ చేయడానికి అధికారాన్ని కలిగి ఉన్నారు అయితే అధికారం లో ఉన్న పార్టీలు ప్రతిపక్షాల ఫోన్ లు టాప్ చేయడమనేది అధికార దుర్వినియోగమే అంతే కాకుకుండా వ్యక్తిగత భద్రత డొల్లే అని అనుభవజ్ఞుల మాట
ఇటీవల కాలంలో సెల్ టవర్లు ఎక్కువైన దృష్ట్యా టవర్ మీద కూడా ట్యాపింగ్ పరికరాన్ని ఏర్పాటు చేసి కాల్స్ ను ట్యాపింగ్ చేసే వెసులుబాటు ఉంది. దీని ద్వారా ఆ టవర్ ప్రాంతంలో ఉన్న అన్ని నెంబర్లనూ ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది గరిష్టంగా ఒక ఫోన్ ను మూడు నెలల పాటు అదే పనిగా టాపింగ్ చెయ్యచ్చు అయితే ఈ ట్యాపింగ్ తో జరుగుతున్నా నష్టాన్ని అవమానాల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాల్ని అమల్లోకి తెచ్చింది.
దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని, కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా దాదాపుగా 9 వేల ఫోన్ల ట్యాపింగ్ కు గురి అవుతున్నాయని నివేదిక పేర్కొన్నది . గరిష్టంగా ఒక ఫోన్ ను మూడు నెలల పాటు ట్యాప్ చేయవచ్చు ఫిక్స్డ్-లైన్ ఫోన్ల యుగంలో, మెకానికల్ ఎక్స్ఛేంజీలు కాల్ నుండి ఆడియో సిగ్నల్ను రూట్ చేయడానికి సర్క్యూట్లను అనుసంధానిస్తారు . ఎక్సేంజ్ లు డిజిటల్ గా మారినప్పుడు, ట్యాపింగ్ కంప్యూటర్ ద్వారా చేయబడింది. నేడు, చాలా సంభాషణలు మొబైల్ ఫోన్ల ద్వారా జరిగినప్పుడు, అధికారులు సర్వీస్ ప్రొవైడర్ కు ఒక అభ్యర్థన చేస్తారు, ఇది ఇచ్చిన నంబర్లో సంభాషణలను రికార్డ్ చేయడానికి మరియు అనుసంధానించబడిన కంప్యూటర్ ద్వారా రియల్ టైమ్లో వాటిని అందించడానికి వ్యవస్థ ఉంటుంది.
అతి తీవ్ర మైన ఉగ్రవాదులు, మిలిటెంట్లు విషయంలో అయితే ప్రతి రెండు నెలలకొకసారి ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఉగ్రవాదులు, మిలిటెంట్లు విషయంలో అనుమతి తీసుకోకుండానే 72 గంటల పాటు నిఘా సంస్ధలు ఒక ఫోన్ ను ట్యాప్ చేయవచ్చు. ఆ తర్వాత ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే, 48 గంటల్లో ఆ ఫోన్ సంభాషణలను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేయాల్సిన నంబర్ ను టాపింగ్ లేక హ్యాకింగ్ మిషన్లోకి ఫీడ్ చేస్తారు. వాళ్లకు ఎప్పుడు కాల్ వచ్చినా, కాల్ వెళ్లినా వెంటనే అది వెంటనే తద్వారా పార్థి సమ్బసన విపులంగ రికార్డయిపోతుంది, ఈ చట్ట విరుద్ధమైం చర్యకు ఇన్వెస్టిగేషన్ లో నిర్దోషిగా తేలితే జ్ చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే ఈ లాంటి విశ్యాల్ని ట్టబద్ధంగా చేయాలంటే అన్ని చట్ట ప్రకారం పరికరాలు సమకూర్చుకోవాలి. కానీ, కానీ చట్టవ్యతిరేకంగా ఇలాంటి చేయాలంటే అన్ని పరికరాలు, యంత్ర సామాగ్రి విధిగా సమకూర్చుకోవాలి.
భారతదేశంలో ఫోన్ ట్యాపింగ్ ను నియంత్రించే చట్టపరమైన నిబంధనలు రాజ్యాంగం ప్రకారం, జాబితా 1 లోని ఎంట్రీ 31 (ఆర్టికల్ 246) పోస్ట్ లు, టెలిగ్రాఫ్ లు మరియు ఇతర కమ్యూనికేషన్ రూపాలపై చట్టాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది . ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఫోన్ ట్యాపింగ్ జరుగుట నిషేధం . టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ప్రజారోగ్యం, పబ్లిక్ ఎమర్జెన్సీ అనే రెండు కారణాలతో ప్రభుత్వం చట్టబద్ధంగా అడ్డుకోవడం లేదా ట్యాపింగ్ చేయడం, గోప్యతకు సహేతుకమైన పరిమితి విధించడం చట్టపరమైన చర్య . ఇంకా, సబ్ క్లాజ్ 2 ప్రకారం ఇది ఒక క్రిమినల్ చర్య . మీ ఫోన్ ట్యాప్ అయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని మార్గాలు మీ ఫోన్ ను అప్ డేట్ చేసుకోండి ఆధునిక ఫోన్లు ట్యాప్ లు, గూఢచర్యం మరియు వైరస్ ల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడే అనేక అంతర్నిర్మిత భద్రతా ఎంపికలను వాడుకోవాలి .. సురక్షితమైన కమ్యూనికేషన్ యాప్లను ఉపయోగించండి … కాల్ ఫార్వార్డింగ్ను నిలిపివేయండి …మీరు ఆన్లైన్లో ఉన్నప్పుడు విపిఎన్ ఉపయోగించండి …. ఉపయోగించని, కాలం చెల్లిన లేదా అనుమానాస్పద అనువర్తనాలను తొలగించండి. ఫోన్ వాడే సమయాలు అతిగా ఉపయోగించడాలు అన్ని విషయాలు ఆన్ లైన్ లో అప్డేట్ చేయడాలు వ్యక్తిగత గోప్యనికి హానికరము అను బాధితుల మాట …సురక్షిత మైన కమ్యూనికేషన్ వ్యవస్థ మన చేతుల్లోనే ఉందన్నది నిజం…
-డా:కృష్ణ సామల్ల
ప్రొఫెసర్ & ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్
9705890045




