‌ప్రతీ వ్యక్తికి, కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందించాం

  • సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ 1
  • ఇచ్చిన హామీలు నెరవేర్చినం మరో మారు కేసీఆర్‌ ‌ను ఆశీర్వదించడిం : మంత్రి
  • శంకర్‌ ‌పల్లిలో 1512 మందికి డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ల పంపిణీ లో మంత్రి మహేందర్‌ ‌రెడ్డి

ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2: ‌ప్రతీ వ్యక్తికి, కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందించామని, ఇచ్చిన హామీలు నెరవేర్చామని,  మరో మారు కేసీఆర్‌ ‌ను ఆశీర్వదించడని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మరియు గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌ ‌రెడ్డి తెలిపారు.  చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌ ‌పల్లి మండలంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా అడీష్‌ ‌నల్‌ ‌కలెక్టర్‌ ‌ప్రతిమా సింగ్‌, ‌జిహెచ్‌ఎం‌సి జోనల్‌ ‌కమీషనర్‌ ‌శ్రీనివాస్‌ ‌రెడ్డి, మున్సిపల్‌ ‌చైర్పర్సన్‌ ‌సాద విజయ లక్ష్మి, ఆర్డీఓ సాయిరాం, ఎంపీపీ గోవర్ధన్‌ ‌రెడ్డి, జెడ్పిటీసీ గోవిందమ్మ తదితరులతో కలిసి1512 మంది ఇళ్లు లేని నిరుపేదలకు  3వ విడత డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ల పంపిణీ చేశారు. అనంతరం సాగిన భారీ బహిరంగసభ లో ఆయన మాట్లాడుతూ సంక్షేమంలో తెలంగాణ రాష్ట్ర దేశంలోనే నెంబర్‌ 1 అని కొనియాడారు.

శంకర్‌ ‌పల్లిలో
రూ. 131 కోట్ల నిధులతో 14 బ్లాకులలో 9.03  ఎకరాల లో 1512 ఇళ్ల నిర్మాణాలు చేశామని మహేందర్‌ ‌రెడ్డి తెలిపారు.గతంలో ఎప్పుడు లేని విధంగా జిహెచ్‌ఎం‌సి పరిధిలోని నిరుపేదలకు రూ. 10వేల కోట్లతో లక్ష డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లను సీఎం కేసీఆర్‌ ‌నిర్మించి ఇస్తున్నా మని మంత్రి వెల్లడించారు. పేదరిక నిర్మూలనలో, సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ నెంబర్‌ ‌వన్‌ ‌గా రాష్ట్రంలో ప్రతీ మనిషికి, ప్రతి కుటుంబానికి ఏదో రకంగా సంక్షేమ పథకం అందేలా చూసిన ఘనత మా ప్రభుత్వానిదే అని వివరించారు.రైతు బంధు, బీమా లాంటి  పథకాలే గాకుండ, మైనారిటీలకు షాదీ ముబారక్‌  ‌పథకంతో పాటు, బీసీ,  ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.పేదల స్వంతింటి కల నెరవేరే నెరవేరాలని జిహెచ్‌ఎం‌సి పరిధిలో తొలి విడతలో 11,700 అందివ్వగా, 2వ విడతలో 13,200 ఇళ్లను, నేడు 3 విడతగా 19,020 ఇళ్ల పంపిణీతో ఇప్పటి వరకు 34,920 ఇళ్ల ను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ నెల 5 న 4 వ విడత 17864 మందికి ఇళ్ల పంపిణీ చేస్తామని వెల్లడించారు.

జిహెచ్‌ఎం‌సి పరిసర రంగారెడ్డి జిల్లా పరిధిలో
23, 260 ఇళ్ల ను నిర్మించి ఇస్తున్నామని  ఇబ్రహీంపట్నంలో 9872, మహేశ్వరం నియోజకవర్గంలో 9892, రాజేంద్రనగర్‌  ‌లో 696, ఎల్బీనగర్‌ ‌లో 944, చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌ ‌పల్లిలో 1512, శేర్లింగంపల్లిలో 344  ఇళ్ల ను నిర్మించి ఇస్తున్నట్లు వివరించారు.హైదరాబాద్‌ ‌నగరాన్ని ప్రత్యేక కాంగా పాత నగరాన్ని అభివృద్ధి పరిచేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఎం‌తో కృషి చేస్తున్నారని,చేవెళ్ల ఎంఎల్‌ఏ ‌యాదయ్య మాట్లాడుతూ సిఎం కేసీఆర్‌ ‌నేతృత్వంలో రాష్ట్రంలో సబండ వర్గాల అభివృద్ధి సాగుతుందని, గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సాగుతుందని యాదయ్య వివరించారు. శంకర్పల్లి మండలంలో స్థానికులకు ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *