•టీజేఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మేకపోతుల నరసయ్య
ముషీరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 30 : నియోజకవర్గంలోని వోటర్లందరూ ఓటు సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామాన్ని కాపాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలంగాణ జన సమితి(టీజేఎస్) గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మేకపోతుల నరసయ్య గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు వోటర్ మహాశయులు మార్పుకు శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో ముషీరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నియంత పాలను దించడంలోనూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలోనూ వోటర్ మహాశయులు తమ పాత్రను నెరవేర్చినందుకు తెలంగాణ జన సమితి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.





