‌ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసిన కెసిఆర్‌

  • ఆయన ఓటమే నా ప్రథమ లక్ష్యం
  • బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌

‌కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణ ఆశలను, ఆకాంక్షలను దెబ్బతీసి, సొంత కుటుంబ సంక్షేమానికి పాటుపడుతున్న కెసిఆర్‌ ఓటమే తన లక్ష్యమని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌మరోసారి ప్రకటించారు. కేసీఆర్‌ ‌రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయారని, ఎప్పుడు ఎన్నికలు వొచ్చినా టీఆర్‌ఎస్‌ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని, ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. తన సవాల్‌ను స్వీకరించి సమాధానం చెప్పే దమ్ములేక కేసీఆర్‌, ‌తన బానిసలతో ప్రెస్‌వి•ట్‌లు పెట్టించి అవమానకరమైన భాష మాట్లాడించారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను ఓడగొట్టడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. శనివారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ను రాజకీయంగా ఓడగొట్టకపోతే తన జన్మకకు అర్థం లేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ రాకెట్‌ ‌కంటే వేగంగా దూసుకుపోతుందని తెలిపారు.

కేసీఆర్‌పై హుజురాబాద్‌ ‌లేదా గజ్వేల్‌ ఎక్కడైనా సరే తాను పోటీకి సిద్ధమని ఆయన సవాల్‌ ‌విసిరారు. కేసీఆర్‌ ‌పోటీకి దిగుతానని పదేపదే ఈటల ప్రకటిస్తూ వొస్తున్నారు. దమ్ము, ధైర్యం ఉంటే హుజూరాబాద్‌ ‌గడ్డపై పోటీకి రావాలని సవాల్‌ ‌విసిరిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ ‌కంటే తనకే ఎక్కువ వ్యక్తిగత పరిచయాలున్నాయని వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు కమలనాథులు బహుముఖ వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ నిర్వహించిన అంతర్గత సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీకి 30 సీట్ల వరకు వొస్తాయని తేలినట్లు సమాచారం. ఈ క్రమంలో రాబోయే మూడు నెలలు తెలంగాణలోని 119 నియోజకవర్లాల్లో ఉధృతంగా పర్యటించి, పార్టీని పటిష్ఠం చేసిన తర్వాత పరిస్థితిలో గుణాత్మకమైన మార్పు వొస్తుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *