ప్రజలు ధైర్యంగా ఉండాలి

ప్రభుత్వం అండగా ఉంది
సీఎం కెసిఆర్ స్వయంగా సమీక్షిస్తున్నారు
నాకు ఫోన్ చేసి, ప్రజల యోగ క్షేమాలు తెలుసుకుంటున్నారు
ముంపు ప్రాంతాల ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి భరోసా
ప్రకృతి విలయానికి తల్లడిల్లిన పలు ప్రాంతాలు
వరద ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు
రంగంలోకి దిగిన రెస్క్యూటి ములు, గజ ఈతగాళ్లు, పడవలు
వరద ముంపు ప్రాంతాలను విస్తృతంగా పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

 

తెలంగాణ రాష్ట్రంలో గత 5 రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని విధాలా కాపాడుతుందని, ప్రజలు ధైర్యంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ రోజు మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లాలో, పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో చిన్న మడూరు చెరువు, అప్పిరెడ్డి పల్లె, పాలకుర్తి,  రామవరం, పోచంపల్లి, తొర్రూరు, అమ్మాపురం బ్రిడ్జి, మాటేడు, వెలికట్టె, నాంచారి మడూరు, రాయపర్తి Mro ఆఫీస్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలలో నీట మునిగిన ప్రాంతాలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్య, కమిషనర్ రిజ్వాన్ బాషా, కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలను స్వయంగా కలిసి సహాయక చర్యల్లో పాల్గొని ధైర్యం చెప్పారు. ప్రభుత్వ అండదండలు ఉంటాయన్న భరోసాను కల్పించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సంతోష్ నగర్ లో మంత్రి స్వయంగా ముంపు ప్రాంతాల ప్రజలకు నీరు, ఆహార పొట్లాలు అందించారు. ఓ ట్రాక్టర్లో తరలిస్తున్న ప్రజలను కలిసి ముచ్చటిస్తూ ఓ పసికందుని ఎత్తుకొని ముచ్చట పడ్డారు. హంటర్ రోడ్డులోని సంతోషిమాత గుడి దగ్గర లోతట్టు ప్రాంతంలో నీటిలో చిక్కుకుపోయిన ఓ వృద్ధురాలును ఎమ్మెల్యే నన్ను ఫ్రెండ్ నరేందర్ వరంగల్ మహానగరం మేయర్ గుండు సుధారాణి కలెక్టర్ ప్రావీణ్య కమిషనర్ రిజ్వాన్ బాషా, రెస్క్యూ టీం సభ్యులు పాటు, పడవలో స్వయంగా వెళ్ళి సురక్షితంగా ఒడ్డుకు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. మరోవైపు నీటి మునిగిన ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు మోకాల్లోతు నీటితో స్వయంగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందని ఎవరూ భయపడవద్దు అని అభయం ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిస్థితిని సీఎం కెసిఆర్ స్వయంగా సమీక్షిస్తున్నారన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తనకు సీఎం కెసిఆర్ ఫోన్ చేసి, ప్రజల యోగ క్షేమాలు తెలుసుకుంటున్నారన్నారు. మరోవైపు సిఎస్ అధికారులతో సమన్వయం చేస్తున్నారన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి భరోసా ఇచ్చారు. ఈ ప్రకృతి విలయానికి తల్లడిల్లిన పలు ప్రాంతాలల్లో వరద ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాం అన్నారు. ప్రభుత్వం తరుపున రెస్క్యూ టీములు, గజ ఈతగాళ్లు, పడవలను పెట్టామని వారు సహాయక చర్యల్లో అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. అలాగే ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని అన్నారు. నీట మునిగిన ప్రాంతాల ప్రజలకు నీరు, ఆహారం అందచేస్తున్నాం అన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టి వరద ముంపు నివారణ జరిగే వరకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా చోట్ల పునరావాస కేంద్రాలు పనిచేస్తాయని అలాగే సహాయక చర్యలు కొనసాగుతాయని ఆ పనులను పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అధికారులు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారని ప్రజలు ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో అధైర్య పడవద్దని తమ సమస్యలు ఏమైనా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి పరిష్కరించుకోవాలని ఎల్లవేళలా ప్రజలకు మంత్రిగా తాను ఎమ్మెల్యేలు మేయర్ ఇతర ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు కలెక్టర్లు కమిషనర్ అధికారులు అందరూ అందుబాటులో ఉంటారని మంత్రి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *