ప్రజలందరికి దీపావళి శుభాాంక్షలు

మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 11: మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి,బిఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి  పి.సబితా ఇంద్రారెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని సబితమ్మ ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి ప్రతీ ఇంటా ఆనందాలను, సిరులను కురిపించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఆహ్వానించే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవి మీ ఇంటిల్లిపాదినీ సకల శుభాలతో అనుగ్రహించాలని కోరుకుంటున్నానని మంత్రి పేర్కొన్నారు. బాణా సంచా కాల్చే సమయంలో  ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని సబితా ఇంద్రారెడ్డి గారు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *