ప్రచార ఆర్భాటాలకే చిరుధాన్యాల సాగు!

ప్రపంచంలో డెబ్భై శాతం పైగా దేశాల మద్దతుతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2023 సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించడానికి ప్రధానమంత్రి దార్శనికత, చొరవ దారి తీసిందని జబ్బలు చరుచుకుంటున్నారు. సుస్థిర వ్యవసాయంలో మిల్లెట్ల పాత్ర స్మార్ట్ సూపర్‌ఫుడ్‌గా దాని ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడంలో ఇది సహాయపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మిల్లెట్‌లు మానవులు పండించే తొలి పంటలలో ఒకటి, పోషకాలకు ముఖ్యమైన మూలం అని తెలియజేసినా, భవిష్యత్తు కోసం దీనిని ఆహార ఎంపికగా మార్చాలని నొక్కి చెప్పినా ప్రజల ఆహార పద్ధతిలో మార్పు లేదు. ఆహార భద్రతకు సంబంధించిన సవాళ్లను అలాగే శ‌తాబ్దానికి ఒక‌సారి వ‌చ్చే మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న సంఘర్షణలను తిప్పికొట్టడంలో ప్రభుత్వాల ఉదాసీనత పనికిరాదు. వాతావరణ మార్పు ఆహార లభ్యత ఎలా ప్రభావితం చేస్తుందో తెలియకుంటే ప్రమాదకరం . తృణధాన్యాలు ప్రపంచ ఉద్యమం ఆహార భద్రత దిశలో ఒక ముఖ్యమైన ముందడుగు, చిరుధాన్యాలు సులభంగా పెరగగలవు, వాతావరణాన్ని కరువును తట్టుకోగలవు. మిల్లెట్లు సమతుల్య పోషకాహారానికి గొప్ప మూలం, సహజ వ్యవసాయ విధానాలకు అనుగుణంగా తక్కువ నీరు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నా, ప్రభుత్వం నుండి ప్రోత్సాహకం లేక రైతులు పాటించడం లేదు. మిల్లెట్స్ పండించడం రైతులకు, సమాజానికి అలాగే వాతావరణానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. వాస్తవానికి తృణ ధాన్యాల వినియోగం గత పది సంవత్సరాలుగా దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, ఓరిస్సా, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు ఆహారంగా ఉండేది. పది సంవత్సరాల క్రిందట 8.6 లక్షల హెక్టార్లలో తృణ ధాన్యాలు పండించే వారు, ఇప్పుడు కేవలం 1.86 లక్షల హెక్టార్లకు పరిమితమయింది. ఫార్మర్స్ ఇంట్రెస్ట్ గ్రూప్ అలాగే రాష్ట్రాల మిల్లెట్ బోర్డులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. దేశంలో రెండు విడతలుగా 25 కోట్ల సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. రైతులకు ఎంతమేరకు ఉపయోగపడుతుందో తెలుస్తూనే ఉంది. గత నాలుగు సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క భూసార పరీక్షా చేపట్టని రాష్ట్రాలు ఉన్నాయి. చాల రాష్ట్రాల్లో సేంద్రియ కర్బనం పూర్తిగా తగ్గింది. జాతీయ మట్టి సర్వే–భూ వినియోగ ప్రణాళిక సంస్థ వారు స్థానిక సాగు భూములు తీరుతెన్నులు, వాతావరణ పరిస్థితులను బట్టి ఏయే పంటలు సాగు చేసుకుంటే ఫలితం బాగుంటుందని సూచనలు ఇస్తున్నారు. ఈ మధ్య వారు ప్రచురించిన నివేదికలో తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో సేంద్రియ కర్బనం అడుగంటిందని, ఇప్పటికైనా ప్రభుత్వం, రైతులు జాగ్రత్తపడి సేంద్రియ కర్బనాన్ని కనీసం 0.7 కైనా పెంచుకోకపోతే భూములు సాగు యోగ్యం కాకుండా పోతాయని హెచ్చరించారు. భూమిని నమ్ముకోవడం అంటే, పంట భూములు ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చేస్తూ సేంద్రియ కర్బనాన్ని పెంపొందించుకోవడం. భూమి ఆరోగ్యానికి సేంద్రియ కర్బనం ఒక ముఖ్య సూచిక. మన భూముల్లో 0.5 % కన్నా సేంద్రియ కర్బనాన్ని పెంపొందించడం కష్టసాధ్యమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, రసాయనిక ఎరువులకు పూర్తిగా స్వస్తి పలికి ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తున్న కొందరు రైతులు మాత్రం 2.0% వరకు పెంచుకోవడం సాధ్యమేనని నిరూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో, స్వల్పకాలంలోనే సేంద్రియ కర్బనాన్ని పెంచుకునే అనేక మార్గాలున్నాయని సూచిస్తున్నారు. భూమిపై మరియు డైనింగ్ టేబుల్ వద్ద వైవిధ్యం ఆవశ్యకతను, పౌష్టికాహార లోపం గురించి నిరంతరం చెబుతున్న ఆహార శాస్త్రవేత్తల హెచ్చరికలను సలహాలను ప్రభుత్వం తుంగలో తొక్కింది , వ్యవసాయం ఏక పంటగా మారితే మన ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆహార వైవిధ్యాన్ని పెంచడానికి తృణధాన్యాలు మంచి మార్గమని సూచించినా ప్రయోజనం లేదు. రైతులకు ప్రోత్సాహకాలు అలాగే మంచి విత్తనం కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విమఫలమయ్యింది. గ్రామాలల్లో పాడి తక్కువయ్యి జొన్న, సజ్జ, రాగి, కొర్ర పంట తక్కువయ్యింది. చిరుధాన్యాలు వినియోగదారునికి, సాగుదారునికి వాతావరణానికి మేలు చేస్తాయి. ప్రజలకు, వినియోగదారులకు సమతుల్య పోషణ గొప్ప మూలం. సాగు దారులకు భూమి సారవంతమవుతుంది అలాగే మన పర్యావరణానికి ప్రయోజనం చేకూరుస్తాయి , మిల్లెట్లు ముతక ధాన్యాలు, వీటిని సాంప్రదాయకంగా 5000 సంవత్సరాలకు పైగా భారత ఉపఖండంలో పండిస్తారు. అవి అధిక పోషక విలువలను కలిగి ఉంటాయి. మరియు ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్‌లతో సమృద్ధిగా ఉంటాయి. ఇతర తృణధాన్యాల మాదిరిగా కాకుండా, మిల్లెట్లకు తక్కువ నీరు మరియు నేల సంతానోత్పత్తి అవసరం. మిల్లెట్ల స్థోమత వాటిని “పేదవారి ఆహార ధాన్యం” అని కూడా ట్యాగ్ చేస్తుంది. ప్రపంచం ఇప్పుడు మిల్లెట్‌లను వాటి అపారమైన సామర్థ్యం కోసం గమనిస్తోంది. భారతదేశం 170 లక్షల టన్నుల కంటే ఎక్కువ ఉత్పత్తితో మిల్లెట్లకు ప్రపంచ కేంద్రంగా మారడానికి ప్రణాళికలు రూపొందించాలి , ఆసియాలో ఉత్పత్తి చేయబడిన మిల్లెట్లలో అగ్రగామిగా నిలువడానికి కృషి చేయాలి.
సింధు నాగరికతలో ఈ ధాన్యాలకు సంబంధించిన తొలి ఆధారాలు కనుగొన్నారు. అలాగే ఆహారం కోసం పెంపకం చేసిన మొదటి మొక్కలలో ఇది ఒకటి. ఇది దాదాపు 131 దేశాలలో సాగవుతున్నాయి. ఆసియా, ఆఫ్రికాలో సుమారు 60 కోట్ల మందికి సాంప్రదాయ ఆహారం తృణధాన్యాలే. ఇంత గొప్ప మేలు కలిగిన చిరుధాన్యాల సాగు కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమయింది. దేశంలో రైతుకు సరైన విత్తనం ఇవ్వడం లేదు, రైతులకు విత్తనం అందుబాటులో లేక సుదూర ప్రాంతాల నుండి తెచ్చుకుంటున్నారు. రైతు భరోసా కేంద్రాలలో, రైతు వేదికలల్లో తృణధాన్యాలు దొరకడం లేదు. మిల్లెట్స్ సంవత్సరం 2023 సురక్షితమైన, స్థిరమైన మరియు ఆరోగ్యకరమైన భవిష్యత్తు దిశగా సామూహిక ఉద్యమాన్ని ప్రారంభించాలని పౌర సమాజం అలాగే ప్రభుత్వం ఆకాంక్షించాలి. మిల్లెట్ పంటల ఉత్పత్తి క్షీణించడం వల్ల మిల్లెట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాగు చేసే రైతుకు ప్రోత్సాహం లేదు, ఫార్మర్స్ ఇంటరెస్ట్ గ్రూప్ ఏర్పాటు చేయాల్సిన వ్యవసాయ శాఖ అసలు పట్టించుకోవడం లేదు. మిల్లెట్ ప్రాసెసింగ్ మరియు మార్కెట్ లింక్, నిలువ చేసుకోవడానికి గోదాములు, శీతల గిడ్డంగులు లేనే లేవు. ఉన్న అరకొర ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజి యూనిట్లు వ్యాపారస్తుల చేతిలో ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయం, సుస్థిర, ప్రాకృతిక వ్యవసాయం, సహకార వ్యవసాయం అనేది భ్రమ గా మిగిలింది. తరచుగా మిల్లెట్ సాగును కలిగి ఉన్న సాంప్రదాయ వ్యవసాయ విధానాలు, వరి, గోధుమ, మొక్కజొన్న వంటి అధిక దిగుబడినిచ్చే పంటలకు ప్రాధాన్యతనిచ్చే ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా చిరుధాన్యాల సాగు పలుచబడుతుంది. మార్కెట్ డిమాండ్, సాగు సౌలభ్యం ప్రభుత్వ విధానాలతో సహా వివిధ కారణాల వల్ల ఈ పంటలు చతికిలపడ్డాయి. సమాజాలు ఆధునికీకరణ పట్టణీకరణ, ఆహార ప్రాధాన్యతలు వినియోగ విధానాలు మారుతాయి. అనేక ప్రాంతాలలో ఒకప్పుడు ప్రధానమైన ఆహారాలుగా ఉన్న మిల్లెట్లను ప్రాసెస్ చేసిన ఆహారాలు, శుద్ధి చేసిన ధాన్యాలు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ భర్తీ చేశాయి. ఆహార ప్రాధాన్యతలలో ఈ మార్పు ఫలితంగా డిమాండ్ తగ్గి వ ఉత్పత్తిలో క్షీణతకు దారితీసింది. వరి, గోధుమ వంటి ప్రధాన తృణధాన్యాల పంటలతో పోలిస్తే, మిల్లెట్‌లు పరిశోధన, అభివృద్ధి సాంకేతిక పురోగమనాల పరంగా చాలా తక్కువ శ్రద్ధను పొందాయి. పెంపకం కార్యక్రమాలు, పంటల మెరుగుదల, మిల్లెట్ల కోసం వ్యవసాయ పద్ధతులపై పరిమిత పెట్టుబడి వాటి ఉత్పాదకత పోటీతత్వాన్ని అడ్డుకుంది. వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా మెరుగైన రకాలను అభివృద్ధి చేయడానికి దారితీస్తుంది. ఇందులో పంట ఉత్పాదకతను పెంపొందించే ప్రయత్నాలు, తెగుళ్లు వ్యాధుల నిర్వహణ, మంచి విత్తనం, పంటకోత అనంతర సాంకేతికతలు కేవలం ప్రచారానికి పనికొస్తున్నాయి. మిల్లెట్ల పోషక ప్రయోజనాల గురించి అవగాహన పెంచడం మరియు వాటి వినియోగాన్ని ప్రోత్సహించడం డిమాండ్‌ను సృష్టించడం మార్కెట్ అవకాశాలను పెంచడంలో సహాయపడుతుంది. మిల్లెట్ల బహుముఖ ప్రజ్ఞ ఆరోగ్య ప్రయోజనాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడం వలన వినియోగదారుల ప్రాధాన్యతను పెంచి, ఈ పంటలను పండించడంలో రైతులకు మద్దతునిస్తుంది. ప్రోత్సాహకాలు, రాయితీలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని అందించే విధానాల ద్వారా మిల్లెట్ సాగుకు మద్దతు ఇవ్వడంలో ప్రభుత్వాలు కీలక పాత్ర పోషిస్తాయి. పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ దాణా కార్యక్రమాలలో చిరుధాన్యాలు చేర్చడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు ప్రోత్సహించడం మిల్లెట్ ఉత్పత్తిని పునరుజ్జీవింపజేయడానికి దోహదం చేస్తాయి. రైతులకు జ్ఞాన మార్పిడి, శిక్షణ కార్యక్రమాలు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను సులభతరం చేయడం వల్ల చిరుధాన్యాలను సమర్థవంతంగా పండించడానికి అవసరమైన నైపుణ్యాలు జ్ఞానాన్ని వారికి అందించవచ్చు. ఇది ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, నీటి నిర్వహణ పద్ధతులు , వాతావరణ-స్మార్ట్ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం. ఈ కారకాలను పరిష్కరించడం, సహాయక చర్యలను అమలు చేయడం ద్వారా, మిల్లెట్ పంట ఉత్పత్తిలో క్షీణిస్తున్న ధోరణిని తిప్పికొట్టడం, స్థిరమైన వ్యవసాయం, ఆహార వ్యవస్థలలో మిల్లెట్ ప్రాముఖ్యతను పునరుద్ధరించడం సాధ్యమవుతుంది.

-డా. ముచ్చుకోట సురేష్ బాబు,
అధ్యక్షులు, ప్రజాసైన్స్ వేదిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *