పాలమూరు-రంగారెడ్డికిజాతీయ హోదా కల్పించండి

  • ప్రధాని మోదీ ఎవరికి దేవుడు
  • నారాయణపేట సభలో మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌
  • 196 ‌కోట్లతో అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు
  • 11 లక్షల ఎకరాలకు సాగునీరు
మహబూబ్‌నగర్‌, (‌నారాయణపేట), ప్రజాతంత్ర, జనవరి 24 : కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని భాజపా నాయకులకు రాష్ట్రం అభివృద్ధి కోరుకునే వారు నిరూపించుకోవాలని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో 196కోట్ల నిధులతో ప్రారంభోత్సవాలను శంకుస్థాపన రాష్ట్ర మంత్రివర్యులు తారక రామారావు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ…నారాయణపేట జిల్లా సింగారం దగ్గర నూతనంగా నిర్మించిన భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన, 62.10 కోట్లతో జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయం, 38.50 కోట్లతో ఎస్పీ కార్యాలయాల సముదాయాలు, 2.90 కోట్లతో ధన్వాడ పోలీస్‌ ‌స్టేషన్‌,1.75‌కోట్లతో తహసీల్దార్‌ ‌కార్యాలయం, 7 కోట్లతో మరికల్‌ ‌మండల కాంప్లెక్స్ ‌మరియూ 2.90 కోట్లతో నారాయణపేట రూరల్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌భవనాల నిర్మాణాలకు,56 కోట్లతో అప్పంపల్లి నుండి కోయిలకొండ వరకు డబుల్‌ ‌రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపనలు, కోటి రూపాయలతో మేకనైజ్డ్ ‌ధోభీఘట్‌, ‌కోటి రూపాయలతో సేవాలాల్‌ ‌భవనం, 2.90 కోట్లతో ధన్వాడ పోలీసు స్టేషన్‌ ‌భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన మంత్రులు కేటీఆర్‌, ‌మహమూద్‌ అలీ, నిరంజన్‌ ‌రెడ్డి.
జిల్లా ఎమ్మెల్యేలు. జిల్లా కేంద్రంలోని బస్‌ ‌స్టాప్‌ ఎదురుగా 6కోట్లతో నూతనంగా నిర్మించిన సమీకృత మార్కెట్‌ ‌సముదాయాన్ని ప్రారంభించిన మంత్రులు, నారాయణపేట జిల్లా కేంద్రంలో 49లక్షలతో నూతనంగా నిర్మించిన సఖి కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు, జిల్లా కేంద్రంలోని కొండారెడ్డి పల్లి చెరువుకు అనుకోని 4కోట్లతో నిర్మించిన మినీ ట్యాంక్‌ ‌బండ్‌ ‌ను ప్రారంభించిన మంత్రులు మంత్రులు కేటీఆర్‌, ‌మహమూద్‌ అలీ, మహమూద్‌ అలీ, నిరంజన్‌ ‌రెడ్డి, మంత్రి కె టి ఆర్‌ ‌మాట్లాడుతూ…నేడు పేట నియోజకవర్గంలో 196కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభించడం జరిగింది. ఇంటిగ్రేటెడ్‌ ‌మార్కెట్‌ ‌డిజైన్‌ ‌బాగుంది చెరువు దగ్గర పనులు చూడచక్కగా ఉన్నాయి రహదారి లేని ప్రాంతాన్ని చక్కగా తయారుచేసారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సీనియర్‌ ‌సిటిజన్‌ ‌పార్కు ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఎమ్మెల్యే రాజేందర్‌ ‌రెడ్డి సీఎం తో పట్టుబట్టి అన్ని పనులు చకచకా చేసుకుంటున్నారు రాష్ట్రంలో ఏ మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్‌ ‌మండల కార్యాలయాలు లేవు కానీ మరికల్‌ ‌మండల కేంద్రంలో ఇలాంటి ఇంటిగ్రేటెడ్‌ ‌మండల కాంప్లెక్‌ ‌నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది బీజేపీ నాయకులను నేను అడుగుతున్న దాదాపు 9 సంవత్సరాలు అయ్యింది కానీ ఇప్పటి వరకు నీటి పంచాయతీ కేంద్రం చేయలేదు వారికి దున్నపోతు మీద వాన పడినట్టు ఉంది వారికి చిత్తశుద్ధి లేదు రాష్ట్రాలు వేరుపడి 9సంవత్సరాలు అయ్యింది కానీ పీఎం కానీ నాయకులకు తీరిక లేదు ఒక లేఖ రాస్తే పంచాయతీ అయిపోతుంది నీళ్లు,నిధులు, నియామకాల కోసం ఏర్పడింది తెలంగాణ ఏర్పడింది ఉద్యోగుల కోసం స్థానికులకు 95శాతం రిజర్వేషన్‌ ఇచ్చిన ఘనత మన ప్రభుత్వ నిది నీళ్ళు పంచాయతీ చేయకపోయినా ఉమ్మడి పాలమూరులో 11లక్షల ఎకరాల్లో నీరు అందించి పంటలు పండిస్తున్నాం చేతనేట పాలమూరు వేదికగా తీర్మానం చేసి పాలమూరు కు జాతీయ హోదా ఇవ్వాలి అని తీర్మానం చేయండి మీకు వెన్నుపూస ఉంటే తీర్మానం చేయండి ఈ బడ్జెట్‌ ‌లో హోదా ఇప్పించండి మోడీ ఎందుకు దేవుడు 120రూపాయలు పెట్రోల్‌ ‌చేసినందుకు,సిలిండర్‌ ‌ధర పెంచినందుకా కర్ణాటక మహారాష్ట్ర ల పంచాయతీ చేయనోడు రష్యా ఉక్రెయిన్‌ ‌ల యుద్ధం ఆపిండు అంట పీఎం కష్టపడి కరోన వ్యాక్సిన్‌ ‌కనుగొన్నారు అని కేంద్ర మంత్రి అంటారు ఎంత హాస్యాస్పదం ఇది చూ మంత్రం.
వేసాదంట ప్రతి అకౌంట్లు లో 15లక్షలు ఇస్తా అన్నాడు ఎక్కడ ఉంది రాష్ట్రపతి ఉరికి ఇప్పుడు ఆమె రాష్ట్రపతి అయిన తర్వాత కరెంట్‌ ఇచ్చారు ఎవరి ఆదాయాలు డబుల్‌ ‌కాలేదు కష్టాలు డబుల్‌ అయ్యాయి ఒక్క తెలంగాణ లో మన పాలనలో రైతుల కు కావాల్సిన ఇస్తున్నాం బేకర్‌ ‌గాళ్లతో మనకు పంచాయతీ ఎందుకు పీఎం ఆర్థిక సలహాదారులు ఒక వ్యాసం రాసారు రైతుల ఆదాయం డబుల్‌ అయింది ఇక వారికి టాక్స్ ‌వేయాలి అని వ్రాశాడు ఇంత దుర్మార్గపు చర్య ఇది రైతుల్లకు టాక్స్ ‌వెయ్యాలి అనే ఆలోచన వారికి వచ్చింది ఇక రైతులు ఆలోచించాలి కులాల మతాల మధ్య చిచ్చులు పెడుతున్న చిల్లరగాళ్ళు ఇక్కడ ఉన్న పథకాలు పక్క రాష్ట్రాలలో ఎందుకు లేవు మీరు ఇచ్చిన డబ్బులు కదా మరి పక్కరాష్ట్రంలో ఎందుకు లేవు దానికి వారి దగ్గర సమాధానం లేదు 14మంది పీఎం లు కలిసి చేసిన అప్పు 56లక్షల కోట్లు ఈయన ఒక్కడే 100లక్షల కోట్లు అప్పు చేశారు సెస్‌ ‌ల పేరు మీద 30లక్షల కోట్లు వసూలు చేశారు దానితో ఎం చేశారు మనం అందించే టోల్‌ ‌తో రహదారులు వేసి మేము జాతీయ రహదారులు ఇచ్చాం అంటారు ఈ పైసలు అన్ని మోడీ దోస్తులు ఇద్దరు ఉన్నారు ఆధాని,అంబానీ లకు చేరుకుంటాయి8 ఏండ్లలో పెద్దపెద్ద వ్యాపారులకు 12లక్షల కోట్లు తాయిలాలు ఇచ్చాడు పేదల కోసం ఉన్న మన ప్రభుత్వం కావాలా పేదల ను కొట్టి పెద్దలకు పెట్టె ప్రభుత్వం కావాలా రాష్ట్ర అధ్యక్షుడు మశిదులు తవ్వుదాం అంటాడు ఇదా మనకు కావాల్సింది వీరూ రాక మునుపు హిందూత్వమ్‌ ‌లేదు వీరే కనుగొన్నమ్‌ అన్న బిల్డప్‌ ‌వీరిది కేంద్రం రాష్ట్రానికి ఒక్క కాలేజ్‌ ఇవ్వలేదు మోడీ కన్నా అసమర్థ ప్రధాని  రాలేదు ఈయన హయాంలో ప్రపంచం లో ఎక్కడ కూడా సిలిండర్‌ ‌ధర ఇంత లేదు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పనిమంతులకు పట్టం కట్టండి.
నారాయణపేట సభలో ఎమ్మెల్యే రాజేందర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ నేడు నారాయణపేట నియోనవర్గం లో 196కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది జిల్లా కేంద్రంలో గతంలో రెండు రోజులకు ఒకసారి నీరు వచ్చేవి ఇప్పుడు ప్రతిరోజు నీరు ఇస్తున్నాం సీఎం గారు ఇచ్చిన హామీ మేరకు ధన్వాడలో డిగ్రీ కళాశాల ప్రారంభించాం జిల్లాకు మెడికల్‌ ‌కళాశాల తో పాటు జిల్లా ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగింది సీఎం గారు పేటకు అగ్రికల్చర్‌ ‌పాలిటెక్నిక్‌ ‌కళాశాల మంజూరు చేయడం జరిగింది ప్రతిపక్షాలకు అభివృద్ధి కనపడటం లేదు వారు కంటివేలుగు కేంద్రాల్లో మీ కళ్ళు చెక్‌ ‌చేసుకోండి కేంద్రం ఎన్ని ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేశారు చూసుకోండి నూతనంగా 10కోట్లతో 11ఎకరాలలో నూతన మినీ స్టేడియంకు శ్రీకారం చుడుతున్నాం సిరిసిల్ల కు ఇయ్యని పనులు మన తాలుకకు ఇచ్చారు నేను నిజాయతీ ఎవరి దగ్గర నిరూపించుకోవాలి వందల ఎకరాల భూమి అమ్ముకున్న చరిత్ర మీది అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మొహమ్మద్‌ అలీ ,వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌ ‌రెడ్డి, మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ ‌రెడ్డి, కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *