పార్లమెంట్‌ ‌సమావేశాలు అతి ముఖ్యమైనవి

సభ్యులంతా పాల్గొనాలి
సమావేశాల సందర్బంగా వి•డియాతో ప్రధాని మోడీ

న్యూ దిల్లీ, జూలై 18 : పార్లమెంట్‌ ‌సమావేశాలు చాలా ముఖ్యమైనవన్న ప్రధాని మోడీ సభ్యులంతా చర్చల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని తాను భావిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ ‌సమావేశాలు ప్రారంభం నేపథ్యంలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ..పార్లమెంట్‌ ‌సమావేశాలు చాలా ముఖ్యమైనవన్న ప్రధాని.. సభ్యులంతా చర్చల్లో పాల్గొనాలని, వొచ్చే 25 ఏళ్ల భవిష్యత్‌ను నిర్మించుకోవాల్సిన సమయమిదని పేర్కొన్నారు. సభ్యులందరూ ఉభయసభల్లో లోతైన చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.

ఈ సమావేశా ల్లోనే కొత్త రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికవుతారని..జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. సమావేశాలను దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందామన్న మోదీ.. పార్లమెంట్‌లో చర్చలు, విమర్శలు అర్థవంతంగా జరగాలని ఆకాంక్షించారు. ఇది ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌యుగమని అన్నారు. దేశంలో కొత్తశక్తిని పెంపొందించేందుకు.. పార్లమెంటు సభ్యులు మాధ్యమంగా మారాలని పిలుపిచ్చారు. ఈ సెషన్‌ను దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందామన్నారు. పార్లమెంటులో చర్చలు జరగాలని.. విషయాలను లోతుగా విశ్లేషించాలని మోదీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *