పటాన్ చెరు, ప్రజాతంత్ర,నవంబర్ 30: పటాన్ చెరు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పట్టణంలోని కొన్ని పోలింగ్ స్టేషన్ లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఎన్నికల పోలింగ్. 69 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. పటాన్ చెరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3 లక్షల 97 వేల 237 ఓటర్లు ఉన్నప్పటికీని సుమారుగా 69 శాతం పోలింగ్ నమోదు అయింది. నియోజవర్గంలో మొత్తం 405 పోలింగ్ స్టేషన్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిన్నపాటి ఘర్షణలో జరిగాయి..పటాన్ చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపు మాది అంటే మాది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీలలో విజేత ఎవరు అని తెలవాలంటే డిసెంబర్ మూడో తేదీ వరకు వేచి చూడాల్సిందే మరి.
పటాన్ చెరులో ప్రశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు





