వెంటనే తెలంగాణ భవన్‌లో లెజిస్లేచర్ పార్టీ సమావేశం
సమావేశాలపై సర్వత్రా ఆసక్తి
తీసుకునే నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో చర్చ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : టిఆర్‌ఎస్‌లో ఏం జరుగుతుందనే చర్చ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. నేడు జరిగే కేబినేట్ భేటీ, తరవాత పార్టీ లెజిస్లేచర్ సమావేశంపై ఇప్పుడు చర్చ సాగుతుంది. శనివారం ఉదయం ప్రగతి భవన్‌లో కెసిఆర్ అధ్యక్షతన కేబినేట్ భేటీ ఉంటుంది. అలాగే సాయంత్రం తెలంగాణ భవన్‌లో లెజిస్లేచర్ పార్టీ వి•టింగ్ ఉంటుంది. దీనికి ఎంపిలను కూడా ఆహ్వానించారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో వివిధ అంశలను చర్చించే వీలుంది. ఇటీవలి బీహార్ పర్యటన, జాతీయరాజకీయాల్లో పాత్రపైనా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కేబినేట్‌లో కూడా అసెంబ్లీ సమావేశాలతో పాటు అనేక అంశాలు చర్చకు రావచ్చు.
అయితే కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. టిఆర్‌ఎస్ నేతలు కూడా బిజెపి లక్ష్యంగా విమర్శలకు పదను పెట్టారు. దీంతో అన్నీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. మొన్నటి వరకు జాతీయ రాజకీయాలు, జాతీయ పార్టీ, ప్రత్యామ్నాయ వేదిక చుట్టూ తిరిగింది కేసీఆర్ రాజకీయం. ఇప్పుడు జిల్లా పర్యటనలు, కేబినెట్ సమావేశం, టీఆర్‌ఎస్ ఎల్పీ నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికకు టైమ్ దగ్గర పడుతున్న సందర్బంలో..ఒకే రోజు కేబినెట్, టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశాలు నిర్వహిస్తుండటం ఆసక్తిగా మారింది. సీఎం కేసీఆర్ కార్యాచరణ అంతా మూనుగోడు కోసమా ..లేక ముందస్తు ఎన్నికలకు వెళ్ళే వ్యూహమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనట్లు క్యాబినెట్ వి•టింగ్ ఎజెండా..టీఆర్‌ఎస్ ఎల్పీ వి•టింగ్ ఎజెండా ముందే బహిర్గత పర్చటంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇతర అంశాలపై దృష్టి వెళ్ళకుండా ముందే ఈ అంశాలపై చర్చిస్తామని చర్చ జరుగుతుంది. జరుగుతున్న పరిణామాలు వేరుగా ఉండటంతో ఈ సమావేశాల్లో ఏ అంశాలు చర్చిస్తారనే చర్చ జరుగుతుంది. దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అనూహ్యంగా తన కుటుంబ సభ్యుల పాత్రపై ఆరోపణలు రావటంతో కేసీఆర్ డైలమాలో పడ్డట్లు చర్చ జరుగుతుంది.
మునుగోడుకు ముందే ప్రభుత్వ రద్దు దిశగా ఆలోచన చేస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. కేబినెట్ వి•టింగ్, టీఆర్‌ఎస్ ఎల్పీ వి•టింగ్‌ల ద్వారా పార్టీ నేతలను మానసికంగా ప్రిపేర్ చేసే పని పెట్టుకున్నారా అనే టాక్ నడుస్తుంది. కేసీఆర్‌కు సెప్టెంబర్ సెంటిమెంట్ కూడా ఉండటంతో జరుగుతున్న చర్చలకు బలం చేకూరుతుంది. 2018 సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అది కలిసి వొచ్చింది. ఇప్పుడు సెప్టెంబర్‌లో ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ జరుగుతుంది. సీఎం కేసీఆర్ అనుకున్నదానికి..భిన్నంగా వ్యవహారాలన్నీ జరుగుతుండటంతో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి కూడా పార్టీ వర్గాల్లో కనిపిస్తుంది. బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే బృహత్తర కార్యంలో కేసీఆర్ పాత్ర ఎలా వున్నా..కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తకరమైన అంశం. ఈ క్రమంలో నేటి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.




